RK Math Hyderabad : రూ. 150 ఫీజుతో 'మెడిటేషన్ కోర్సు - పూర్తి వివరాలివే
09 March 2023, 14:05 IST
- Offline meditation course by RK Math: మెడిటేషన్ కోర్సు ఆఫర్ చేస్తూ హైదరాబాద్ లోని రామకృష్ణ మఠ్ నుంచి ప్రకటన విడుదలైంది. కేవలం రూ. 150 ఫీజుతోనే ఈ కోర్సును అందించనున్నారు.
రామకృష్ణ మఠ్‌లో కోర్సు
RK Math Offered Offline meditation course: హైదరాబాద్ లోని రామకృష్ణ మఠ్ మరో కోర్సును తీసుకువచ్చింది. ఆఫ్ లైన్ విధానంలో మెడిటేషన్ కోర్సును ప్రకటించింది. 16 - నుంచి 35 ఏళ్ల మధ్య ఉండే వారు మాత్రమే ఈ కోర్సు తీసుకునేందుకు అర్హులను ప్రకటించింది. ఈ మేరకు కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రకటనలో వివరించింది.
కోర్సు వివరాలివే..
కోర్సు పేరు - మెడిటేషన్ ఫర్ యూత్ (ఆఫ్ లైన్ విధానంలో)
కోర్సు కాలం - కేవలం 3 రోజులు మాత్రమే( సోమవారం నుంచి బుధవారం)
వయస్సు - 16 -35 ఏళ్ల వారు మాత్రమే అర్హులు
తేదీలు - మార్చి 13 నుంచి మార్చి 15 ,2023
కోర్సు ఫీజు - రూ. 150
క్లాస్ టైమింగ్స్ - సాయంత్రం 06.15 నుంచి రాత్రి 07.30 వరకు ఉంటుంది.
మెయిల్ అడ్రస్ - hyderabad.vihe@rkmm.org
ఆన్ లైన్ లో కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://rkmath.org/vihe లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
వాట్సాప్ నెంబర్ - 9177232696, 040 -27627961 ఫోన్ నెంబర్లను సంప్రదించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
నేరుగా హైదరాబాద్ లోని ఆర్కే మఠ్ కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఉదయం 08:30 నుంచి 11. 30 గంటల మధ్య వెళ్లొచ్చు. ఆ తర్వాత సాయంత్రం 04. 30 నుంచి రాత్రి 07.30 మధ్య ఆఫీస్ తెరిచి ఉంటుంది.
ఇగ మెడిటేషన్ (ధ్యానం) విషయానికొస్తే… మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూరుకుపోయి.. ఒక్క క్షణం కూడా తీరిక లేనప్పుడు.. కాస్త బ్రేక్ కావాలని.. ఒత్తిడి తగ్గించుకోవాలని చేసే ప్రయత్నం అని చెప్పొచ్చు. ధ్యానం అనేది ఎప్పటినుంచో ఆచరిస్తున్న ఓ సరళమైన వ్యాయామం అని చెప్పవచ్చు. ఇది మనకు ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది.నేటి ఆధునిక ప్రపంచంలో ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. రోజువారీ కార్యకలాపాలతో.. హడావిడి జీవితాల్లో ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా గడిపేస్తున్నవారికి ధ్యానం చాలా అవసరం. ఆందోళన అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మానసిక ఆరోగ్య రుగ్మతలలో ఒకటిగా ఉంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు మందులు సూచించినప్పటికీ.. వారిలో ఆందోళన అలానే మిగిలిపోతుంది. ఆందోళన ఎక్కువైనప్పుడు వారి హృదయ స్పందన వేగం ఎక్కువై.. హానికరమైన ఆలోచనలు వస్తాయి. వాటిని నిరోధించడానికి ధ్యానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆందోళన వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడానికి ధ్యానం అత్యంత సాధారణ సమగ్ర మార్గాలలో ఒకటని చెప్పవచ్చు. అయితే ఈ ధ్యానం ఎలా చేయాలి..? ఎలాంటి పద్ధతులను అనుసరించాలి..? ఏ సమయాల్లో చేస్తే మంచింది..? వంటి అంశాలను నిపుణుల నుంచి తెలుసుకుంటే సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు.