తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  New Police Stations: రాచకొండ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు.. ఎక్కడంటే..?

New Police Stations: రాచకొండ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు.. ఎక్కడంటే..?

24 December 2022, 20:35 IST

    • Rachankonda Police Commissionerate News: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు (twitter)

కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

New Police Stations In Rachankonda Commissionerate: హైదరాబాద్ నగరం నలుమూలాల విస్తరిస్తోంది. ఇదే సమయంలో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మహేశ్వరం డీసీపీ జోన్ ను ఏర్పాటు చేసింది. మహేశ్వరం డీసీపీ జోన్ లో కొత్తగా ఏసీపీ ఏర్పాటు, ఇబ్రహీం పట్నం ఏసీపీ కూడా మహేశ్వరం డీసీపీ కిందకి చేర్చనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

కొత్త పోలీస్ స్టేషన్లు ఇవే…

చర్ల పల్లి పోలీస్ స్టేషన్

నాగోల్ పోలీస్ స్టేషన్

హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్

మల్కాజ్ గిరి జోన్ లో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

కొత్తగా ట్రాఫిక్ విభాగంలో కొత్త జోన్లు, పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఘట్కేసర్, జవహర్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీం పట్నంలలో ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. మహాశ్వరం ట్రాఫిక్ జోన్ కు ఏసీపీని నియమించనున్నారు. ఎల్బీ నగర్ జోన్, మహేశ్వరం జోన్, మల్కాజిగిరి జోన్ లలో జాయింట్ కమిషనర్ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ప్రతి జోన్ కు అడిషనల్ డీసీపీ ( లా అండ్ ఆర్డర్) స్థాయి అధికారిని నియమించనున్నారు. ఇక యాదాద్రి ఆలయానికి ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు. SOT కి కొత్తగా మహేశ్వరం జోన్ డీసీపీ గా ఏర్పాటు చేస్తారు. స్పెషల్ బ్రాంచ్ కు కొత్తగా ఒక డీసీపీని నియమించనున్నారు.

Rachakonda Police 2022 Annual Report: మరోవైపు శనివారం రాచకొండ కమిషనరేట్​ పరిధిలో వార్షిక నేర నివేదికను సీపీ విడుదల చేశారు. ఈ మేరకు ఏడాది కాలంలో నమోదైన కేసులు, శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు సీసీటీవీల ఏర్పాట్లుతో పాటు పలు అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 19 శాతం నేరాలు పెరిగినట్టు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఇందులో సైబర్ క్రైమ్ నేరాలు 66 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.

ఇక అత్యధికంగా రహదారి ప్రమాదాలు 19 శాతం.. మత్తు పదార్థాల కేసులు 140 శాతం పెరిగాయని సీపీ వెల్లడించారు. హత్యలు, అపహరణల కేసుల శాతం తగ్గిందని చెప్పుకొచ్చారు. మహిళలపై నేరాలు 17 శాతం.. ఆస్తి సంబంధిత నేరాలు 23 శాతం పెరిగాయని వివరించారు. అత్యాచార కేసులు 1.3 శాతం, వరకట్న హత్యలు 5 శాతం తగ్గాయని... మోసాలు 3 శాతం పెరిగాయని వెల్లడించారు. గుట్కా రవాణా కేసులు 131 శాతం తగ్గాయని... రహదారి ప్రమాద మరణాల్లో 0.91 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మానవ అక్రమ రవాణాలో 62 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

తదుపరి వ్యాసం