Rachakonda Police Commissioner: రాచకొండకు కొత్త సీపీ రాబోతున్నారా..?-rachakonda police commissioner is going to change soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rachakonda Police Commissioner: రాచకొండకు కొత్త సీపీ రాబోతున్నారా..?

Rachakonda Police Commissioner: రాచకొండకు కొత్త సీపీ రాబోతున్నారా..?

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 02:38 PM IST

Rachakonda CP Transfer: త్వరలోనే కొత్త తెలంగాణ బాస్ రానున్నారు. ఇదిలా ఉంటే… రాచకొండ కమిషన్ గా ఉన్న మహేశ్ భగవత్ ను కూడా బదిలీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో రాచకొండ కమిషనర్ బదిలీ..?
త్వరలో రాచకొండ కమిషనర్ బదిలీ..?

Rachakonda Police Commissioner News: ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ వస్తారా?అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. కొత్తవారి ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరనేది ఎంపిక పూర్తి కాకపోతే మొదట ఇన్ ఛార్జ్ డీజీపీని నియమించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో నియమించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... హైదరాబాద్ నగరంలో కీలకమైన రాచకొండ కమిషనర్ కూడా బదిలీ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త ఏడాదిలో రాచకొండ కమిషనర్ బదిలీకి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలం నుంచి రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ బదిలీ చేసి... ఏసీబీ డీజీగా స్థానచలనం కల్పిస్తారని తెలుస్తోంది. కొత్త పోలీసు కమిషనర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి కమలాసన్‌ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కమలాసన్‌ రెడ్డి నిజామాబాద్‌ రేంజ్‌ ఇన్‌చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎంపికపై త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది.

అంజనీ కుమార్ కు కీలక పోస్టు..!

ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్... డీజీపీ పోస్టు రేస్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేశ్ భగవత్ ను ఏసీబీ డీజీగా నియమిస్తే... అంజనీ కుమార్ కు ఆ పదవి రావటం ఖాయమనే అనే చర్చ నడుస్తోంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

శాంతిభద్రల విషయంలో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖలో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం నుంచి డీఎస్పీలుగా పని చేస్తున్న పలువురిని కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెలఖారులోగా లేదా కొత్త ఏడాదిలో నియమకాలు, బదిలీలలో చాలా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

IPL_Entry_Point