తెలుగు న్యూస్  /  Telangana  /  Mlas Poaching Case Accused Arrest Again And Produced Nampally Court

MLAs Poaching Case : అప్పుడే విడుదల.. వెంటనే అరెస్టు.. నాంపల్లి కోర్టులో హాజరు

HT Telugu Desk HT Telugu

08 December 2022, 18:34 IST

    • MLAs Poaching Case Update : ఎమ్మెల్యేలకు ఎరకేసు నిందితుల విషయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వారికి బెయిల్ జారీ అవ్వగా విడుదలై.. వెళ్తుంటే.. మళ్లీ అరెస్టు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case) నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌కు బెయిల్(Bail) మంజూరైన విషయం తెలిసిందే. వారిని విడుదల చేశారు. అయితే వారి సామను తీసుకొని వెళ్తేంటే.. మళ్లీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరు పరిచారు. బోగస్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో ఇద్దరినీ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

అక్కడ నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. దోమ మండలంలో సతీశ్ అనే వ్యక్తి భూమి వ్యవహారంలో బెదిరింపులు చేశారని ఫిర్యాదుతో.. నందకుమార్ మీద ఐపీసీ 386, 387 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీరి అరెస్టు కూడా ఆసక్తికరంగా సాగింది. కారాగారం నుంచి తమ వస్తువులతో ఇద్దరూ బయటకి వచ్చారు. అప్పటికే పోలీసు(Police)లు గేటు వద్ద కాపు కాశారు. గేటు దగ్గరకు రాగానే.. సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఎక్కించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫాం హౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేలకు ఎరకేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్ రూ.6 లక్షల చొప్పున నాంపల్లి కోర్టు(Nampally Court)లో పూచీకత్తు సమర్పించారు. చంచల్ గూడ జైలు నుంచి గురువారం ఉదయం నిందితులు విడుదల అయ్యారు. రామచంద్ర భారతి, నందకుమార్ ను ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇదే కేసులో సింహయాజీకి సైతం బెయిల్(Bail) మంజూరైంది. చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. సింహయాజీ న్యాయవాది రూ.6లక్షల పూచీకత్తుతోపాటు ఇద్దరు జామీను సమర్పించారు.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్(BL Santhosh), తుషార్, జగ్గు స్వామిని నిందితులుగా చేరుస్తూ.. దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. దీంతో సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును ఏసీబీ మాత్రమే.. దర్యాప్తు చేయాలని, పోలీసు, సిట్ కు అధికారం లేదన్న.. కోర్టు నిర్ణయంపై రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టుల వాదనలు ముగిశాయి. శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉంది.