MInister Harish Rao: అవ్వతో మంత్రి హరీశ్‌రావ్ మాట ముచ్చట
03 March 2023, 19:55 IST
- MInister Harish Rao News: ప్రభుత్వ పథకాలపై ఓ అవ్వతో ముచ్చటించారు మంత్రి హరీశ్ రావ్. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో మంత్రి పర్యటించగా.. ఓ ఇంటి వద్ద కూర్చున్న అవ్వతో ఆత్మీయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అవ్వతో మంత్రి హరీశ్ రావ్ ముచ్చట
MInister Harish Rao tat Siddipeta: హరీశ్ రావ్... రాష్ట్ర ఆర్థిక మంత్రి. ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు, పర్యటనలు చేస్తూనే... మరోవైపు ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటపై ప్రధానంగా దృషిపెడుతుంటారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తుంటారు. అభివృద్ధి పనులను కూడా పరుగులు పెట్టిస్తుంటారు. ఇందులో భాగంగా ఆయన సొంత నియోజకవర్గం దౌల్తాబాద్ లో పర్యటించిన... ఓ అవ్వను గమనించాడు. ఆమెతో పాటు కింద కూర్చొని ముచ్చట పెట్టాటు. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల గురించి ఆరా తీశారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్‌లో మంత్రి హరీశ్ రావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందు కూర్చున్న ఓ అవ్వను గమనించిన మంత్రి... ఆమె వద్దకు వెళ్లారు. ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీశారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా కేసీఆర్ అండగా ఉన్నారని...మాకేంది బిడ్డా అని అవ్వ బదులివ్వటంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
చంద్రబాబు కామెంట్స్ విడ్డూరం - హరీశ్ రావ్
జగదేవ్ పూర్ బస్టాండ్ లో శుక్రవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. "కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగ రాశారని, కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నదన్నారు. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి సాగు చేశామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు జొన్న గట్క, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, ఇవాళ తన వల్లే అన్నం తింటున్నారని టీడీపీ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి హరీశ్. గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఇవాళ మండుటెండలో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని సంబరం వ్యక్తం చేశారు.