TSCPSEU Dairy 2023 : సీపీఎస్ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు
TSCPSEU Dairy 2023 : తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) - 2023 డైరీని.. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆవిష్కరించారు. డైరీలో సమగ్ర సమాచారం ఉందని... ఇది ఉద్యోగులకి ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
TSCPSEU Dairy 2023 : తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) - 2023 డైరీని.. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆవిష్కరించారు. రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఉద్యోగులు హైదరాబాద్ లో మంత్రి హరీశ్ రావు ని కలిశారు. ఈ సందర్భంగా... యూనియన్ డైరీని మంత్రి ఆవిష్కరించారు. డైరీని పూర్తిగా పరిశీలించిన ఆయన... కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కు సంబంధించి సమగ్ర సమాచారంలో డైరీలో ఉందని అన్నారు. ఇది సీపీఎస్ ఉద్యోగులకి ఉపయోగపడుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ... పాత పెన్షన్ పద్ధతిలో ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేశారన్నారు... మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వం ఉద్యోగులకి అండగా ఉంటుందని.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మ్యాన పవన్, దర్శన్ గౌడ్, ఉపేందర్, మల్లికార్జున్, దేవయ్య, నరేందర్ రావు, కోటకొండ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఫ్యామిలీ పెన్షన్ ఆర్డర్స్ పొందిన ఇద్దరు పెన్షనర్స్ కు రాష్ట్ర కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పత్రాలను... రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కాగా... ప్రస్తుత కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం (Old Pension Scheme) అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా పలు రాష్ట్రాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ... పాత పెన్షన్ విధానం పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో ఢిల్లీలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయా సంఘాల ప్రతినిధులు... సీపీఎస్ విధానం రద్దు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ , రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లేఖ అందజేశారు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారు... పాత పెన్షన్ విధానంపై బీఆర్ఎస్ తరపున నిర్ణయం తీసుకోవాలని కోరారు.