తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : లోయర్ మానేరు డ్యామ్‌లో బోటింగ్.. మధ్యలో దూకేసిన మహిళ.. అంతా ఒక్కసారిగా షాక్!

Karimnagar : లోయర్ మానేరు డ్యామ్‌లో బోటింగ్.. మధ్యలో దూకేసిన మహిళ.. అంతా ఒక్కసారిగా షాక్!

23 September 2024, 17:11 IST

google News
    • Karimnagar : కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ వివాహిత స్పీడ్ బోటు నుంచి నీటిలోకి దూకేసింది. దీంతో బోటులో ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సేఫ్ జాకెట్ విసిరి మహిళను కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ ఎల్ఎండీలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో విషాదం
కరీంనగర్ జిల్లాలో విషాదం

కరీంనగర్ జిల్లాలో విషాదం

కరీంనగర్ ఎల్ఎండీ (లోయర్ మానేరు డ్యామ్)లో దూకి వివాహిత సంధ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టూరిస్ట్ బోటులో టికెట్ కొనుక్కుని బోటు ఎక్కిన సంధ్య.. బోట్ స్పీడ్ పెంచగానే వెనక్కి వెళ్లి నీటిలో దూకేసింది.

సేఫ్ జాకెట్ విసిరి బోట్ డ్రైవర్, బోటులో ప్రయాణిస్తున్న మరికొందరు వ్యక్తులు మహిళను కాపాడారు. లేక్ పోలీసులకు సమాచారమిచ్చి మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళకు ప్రాణాపాయం తప్పిందని బోట్ ప్రయాణీకులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఒక్కసారిగా నీటిలోకి దూకడంతో.. అంతా షాక్‌కు గురయ్యారు.

తదుపరి వ్యాసం