తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Investments In Telangana: తెలంగాణలో రూ. 750 కోట్లతో గోల్డ్, వజ్రాల యూనిట్

Investments in Telangana: తెలంగాణలో రూ. 750 కోట్లతో గోల్డ్, వజ్రాల యూనిట్

HT Telugu Desk HT Telugu

15 October 2022, 19:39 IST

google News
    • malabar gold group unit in telangana: తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మలబార్ గ్రూప్ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో మరో ప్రముఖ సంస్థ పెట్టుబడి
తెలంగాణలో మరో ప్రముఖ సంస్థ పెట్టుబడి (twitter)

తెలంగాణలో మరో ప్రముఖ సంస్థ పెట్టుబడి

malabar group investing in telangana: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మలబార్ గ్రూప్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆభరణాల తయారీ యూనిట్...

మొత్తం రూ. 750 కోట్ల పెట్టుబడితో బంగారం, వజ్రాల యూనిట్ ను ఏర్పాటు చేయనుంది మలబార్ గ్రూప్. సంబంధి సంస్థకు సంబంధించి ఇది అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌గా నిలువనుంది. ఈ పెట్టుబడితో మొత్తం 2,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు తెలంగాణలో ప్రస్తుతం 17 రిటైల్ షోరూమ్‌ లు ఉన్నాయి. ఇందులో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మలబార్ గ్రూప్ పెట్టుబడిపై హర్షం వ్యక్తం చేశారు. రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టడంపై గ్రూప్ ను అభినందించారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సాకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు, మలబార్ గ్రూప్ ఉద్యోగులు పాల్గొన్నారు.

అయిల్ రిఫైనరీ ఏర్పాటు...

singapore company investing 400 crore in telangana: తాజాగా సింగపూర్ కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్, ఫ్రీడమ్ ఆయిల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సంగతి తెలిసిందే. జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.400 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ సమీపంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు కేటీఆర్ తో భేటీ అయ్యారు.

భవిష్యత్‌లోనూ తెలంగాణలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తామని జెమిని ఎడిబుల్స్ సంస్థ ఎండీ ప్రదీప్ తెలిపారు. వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం