TS-iPASS : తెలంగాణకు రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు-telangana gets rs 4 lakh crore investments in 7 years details inside ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts-ipass : తెలంగాణకు రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

TS-iPASS : తెలంగాణకు రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 03:57 PM IST

తెలంగాణకు గత ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన టీఎస్‌-ఐపాస్‌ పథకం (తెలంగాణ పారిశ్రామిక విధానం) విజయవంతంగా రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఏడేళ్లలో దాదాపు ఐదు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయి. MSME ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మరియు బిల్‌మార్ట్ అనే నాలెడ్జ్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనాన్ని MSME EPC ఛైర్మన్ DS రావత్, బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడు & CEO జిగిష్ సొనగరా విడుదల చేశారు.

పది రోజుల కంటే తక్కువ వ్యవధిలో 38 వివిధ శాఖల నుంచి అనుమతులు పొందిన ప్రాజెక్టులలో తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సాధించిందని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినేస్ పెంచేందుకు గణనీయంగా దోహదపడిందని రావత్ అన్నారు. పథకం ప్రవేశపెట్టడానికి ముందు ఏడు సంవత్సరాల వ్యవధిలో వచ్చిన పెట్టుబడుల కంటే తాజా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

టీఎస్ ఐపాస్‌ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ మరియు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్/తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. 2020 డిసెంబరు నాటికి తెలంగాణ రాష్ట్రంలో 13,804 కంపెనీలు దాదాపు రూ.2.24 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు వందశాతం కరప్షన్‌ ఫ్రీతో అనుమతులు ఇస్తారు. పరిశ్రమల కోసం భూమిని సిద్ధం చేసి, నీరు, విద్యుత్‌ను ప్రభుత్వమే సమకూర్చుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌ లైన్‌ లోనే దరఖాస్తులు స్వీకరించి, సీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఛేజింగ్‌ సెల్ ద్వారా పరిశ్రమలకు అనుమతులపై మానిటరింగ్ నిర్వహిస్తారు. అనుమతుల కోసం కాలయాపన లేకుండా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిన పారిశ్రామిక వాడలు ఏర్పాటుచేసి ఆయా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తారు.

Whats_app_banner