Khammam DCCB Chairman: హైకోర్టులో చుక్కెదురు.. పదవి కోల్పోయిన ఖమ్మం డిసిసిబి ఛైర్మన్ నాగ భూషయ్య..
14 February 2024, 6:26 IST
- Khammam DCCB Chairman: ఖమ్మం డిసిసిబి ఛైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
పదవి కోల్పోయిన ఖమ్మం డిసిసిబి ఛైర్మన్
Khammam DCCB Chairman: ఖమ్మం డిసిసిబి చైర్మన్ పదవిపై స్టే కొనసాగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నాయకుడికి కోర్టులో చుక్కెదురు అయ్యింది. అవిశ్వాస తీర్మానాన్ని హైకోర్టు సమర్దించడంతో ఛైర్మన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషయ్య Kurakula Nagabhushayya పై పెట్టిన అవిశ్వాసం సరైనదేనని న్యాయస్థానం తన తీర్పులో వెలువరించింది. ఫలితంగా ఆయన తన పదవిని కోల్పోయారు. దీంతో బీఆర్ఎస్ BRS పార్టీకి ఖమ్మంలో చుక్కెదురైంది. తీర్పు వెలువడిన వెంటనే నాగభూషయ్య బ్యాంకు ఇచ్చిన కారును తిరిగి బ్యాంకుకు అప్పగించారు.
గన్‌మెన్‌లను, చైర్మన్ Chairman హోదాలో తనకు కేటాయించిన వర్కర్లను కూడా తిరిగి పంపించేశారు. కోర్టు తీర్పు రావడంతో తిరిగి డిసిసిబి కొత్త అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు డిసిసిబి చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతల్లో కోర్టు తీర్పుతో ఉత్సాహం నెలకొంది.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం డిసిసిబి చైర్మన్ DCCB Chiraman గత నెల 11వ తేదీన ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వి. వెంకటాయపాలెం సొసైటీలో డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని అధికారులకు అందజేసిన విషయం తెలిసిందే. కాగా పదిహేను రోజుల తర్వాత డీసీవో విజయ కుమారి బల నిరూపణ కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 11 మంది డైరెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. హాజరైన 11 మంది సభ్యులు ముక్తకంఠంతో చైర్మన్ నాగభూషయ్య పై మోపిన అభియోగానికి కట్టుబడి ఓటు వేశారు. కాగా ఈ సమావేశానికి చైర్మన్ కూరాకుల నాగభూషయ్యతో పాటు మరొక డైరెక్టర్ హాజరు కాలేదు.
మెజారిటీ సభ్యులు చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ అధికారులు ఫలితాన్ని మాత్రం రిజర్వ్ చేశారు. తనపై అవిశ్వాసాన్ని సవాల్ చేస్తూ చైర్మన్ High Court కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సందిగ్ధత నెలకొంది. గత నెల 27వ తేదీన సమావేశం జరగగా తాజాగా కోర్టు తీర్పును వెలువరించింది.
ఖమ్మం డిసిసిబి చైర్మన్ వేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేయడంతో అవిశ్వాసానికి బలం చేకూరింది. దీంతో బల నిరూపణ సమావేశం జరిగిన18 రోజుల తర్వాత చైర్మన్ నాగభూషయ్య తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
ఖమ్మం జిల్లా వి.వి.పాలెం VV Palem సొసైటీలో చైర్మన్ పదవిని కోల్పోయిన ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని సైతం కోల్పోయారు. కాగా ఆ పదవి కోసం తాజాగా కాంగ్రెస్ నేతల పోటాపోటీ నెలకొంది.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)