CM KCR : ఫలించిన తొమ్మిదేళ్ల కల.. పాపకు నామకరణం చేసిన కేసీఆర్
18 September 2022, 21:40 IST
- KCR fulfils dream of a couple : తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేళ్ల కల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగింది. తెలంగాణ ఉద్యమ కారుడితోనే తమ కుమార్తెకు పేరు పెట్టించాలని ఎప్పటి నుంచో అనుకున్న వారి కల నెరవేరింది.
సురేశ్ దంపతులతో కేసీఆర్
సురేశ్ దంపతులతో కేసీఆర్
ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరుపెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ మధుసూధనా చారి కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రగతి భవన్ కు తీసుకుని వచ్చారు.
సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను ధీవించి వారి బిడ్డకు.. 'మహతి' అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి ఆథిత్యమిచ్చారు.
బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్ని అందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను ఆదరించి దీవించిన కేసీఆర్ ను చూసి సురేశ్ కుటుంబం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.