తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crop Holiday : 'కడెం' కింద క్రాప్ హాలీడే..! ఆందోళనలో రైతన్నలు

Crop Holiday : 'కడెం' కింద క్రాప్ హాలీడే..! ఆందోళనలో రైతన్నలు

HT Telugu Desk HT Telugu

24 December 2023, 10:52 IST

google News
    • Kaddam Project News: ‘కడెం’ ప్రాజెక్టులోని నీటి నిల్వలు డెడ్ స్టోరీజీకి చేరాయి. దీంతో అనధికారికంగా క్రాప్ హాలీడే ప్రకటించినట్లు అయింది. తాజా పరిస్థితులతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
కడెం ప్రాజెక్ట్
కడెం ప్రాజెక్ట్

కడెం ప్రాజెక్ట్

Kadem Crop Holiday : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అత్యంత ప్రధాన సాగునీటి వనరు అయిన కడెం ప్రాజెక్టు కింద ఈసారి అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు అవాక్కయ్యారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు ను పట్టించు కోక, పాలకులు చేసిన పొరపాటులతో ఈసారి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కడెం ప్రాజెక్టు నీరం దించే పరిస్థితిలో లేదని చెబుతూ అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు సమాచారం. కాగా ఈ పరిస్థితిని రైతులు ముందే పసిగట్టారని, ఈ విషయమే బిఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైందని రైతులు ఆరోపించారు.

గత సెప్టెంబర్ నెలలో అధిక వరదలకు కడం గేట్లు మొరా యించడం, ఒక గేటు కొట్టుకుపోవడం, రిజర్వాయర్లోని నీళ్ళు వృథాగా గోదావరిలోకి విడిచిపెట్టడంతో ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరింది. అయితే ఈ పరిస్థితిని ముందు ప్రకటించకపోవడంతో, కడం కింద రైతులు ఇదివరకే నారుమడులు వేసుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా క్రాప్ హాలిడే ప్రకటించడంతో నారుమడులు ఏం చేయాలో రైతులకు పాలు పోవడం లేదు. ఈ నేపథ్యంలో రైతులపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అయింది. సాగు చేసుకున్న నారుమడులను అలాగే విడిచిపెట్టే పరిస్థితి నెల కొంది. ప్రస్తుతం కాలం దాటిపోతున్న సమయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కడెం కింద 68 వేల ఎక రాలు సాగవుతుండగా… ప్రతిసారి కడం నీటిపై ఆధారపడి వరి పంటలు వేసు కునేవారు... ఉన్న ఫలంగా ఈ భూములను ఇతర పంటలు సాగు చేయడా నికి అనువుగా మార్చాలంటే మరింత ఆర్థిక భారం తప్పదని రైతులు వాపో తున్నారు. కాగా ఖానాపూర్ ఎంఎల్ఎ వెడ్మ బొజ్జు నియోజకవర్గంలోని కడెం, సదర్మార్డ్ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసేందుకు ఇటీవల ఉట్నూ రులోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. ఖానాపూర్ మండలంలోని సదర్మర్డ్ కాలువ ద్వారా యాసంగికి నీరు విడుదల చేయడానికి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి :

ఈ నేపథ్యంలో కడెం, ప్రాజెక్టుకు పూడికతీత ఎత్తు పెంచడం గేట్ల శాశ్వత మరమ్మత్తులు చేసి వేలా దిమంది కడెం రైతులను ఆదుకోవాలని ఇక్కడి రైతులు వేడుకుంటున్నారు. కడెం ప్రాజెక్టులో గత 20 ఏళ్లుగా రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నారు, ఈసారి 4 గేట్లు పనిచేయకపోవడంతో ప్రాజెక్టులో నీరు వృధాగా గోదావరి పాలైంది, ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులకు 7టీ ఎం సి ల నీరు ఉండాల్సింది ఉండగా, ప్రస్తుతం నీటి సామర్థ్యం 4 టి యం సి లకు పడిపోయింది, ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ లెవెల్ లో కలదు, ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంపై రైతులు తీవ్రమైన వ్యక్తం చేస్తున్నారు, రెండో పంటకు నీరు ఇవ్వకపోవడంతో తామేంతో నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అతి పురాతనమైన కడెం ప్రాజెక్టులో పూడిక పనులు చేపట్టి, డ్యాం ఎత్తు పెంచి కడం కింది 68 వేల ఎకరాల పంట పొలాలకు నీరందించాలని వేడుకుంటున్నారు.

రైతులను ఆదుకోవాలి : నంది రామన్న,రైతు సంఘ నాయకులు

కడెం ప్రాజెక్టు కింద రెండో రైతులకు రెండో పంటకు నిరందించాలని అఖిల భారత రైతు సంఘం నాయకులు నంది రామన్న డిమాండ్ చేశారు, అధికారుల మాట ప్రకారం రెండో పంటకు నీరు అందిస్తామంటే రైతులు నారు పోసుకున్నారని సుమారు 80000 ఎగరాలకు నీరు అందించే ప్రాజెక్టు ప్రస్తుతం 20 నుంచి 30 వేలకు ఎకరాలకు నీరు అందించే స్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు, నారు పోసుకొని నీరు కోసం ఎదురుచూస్తున్న రైతులు కోట్ల రూపాయలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు, అధికారులు, ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం వీడి కడెం ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్

తదుపరి వ్యాసం