తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Nashik Tour: నాసిక్, షిర్డీ టూర్... 4 వేల ధరలో 4 రోజుల ప్యాకేజీ, వివరాలివే

IRCTC Nashik Tour: నాసిక్, షిర్డీ టూర్... 4 వేల ధరలో 4 రోజుల ప్యాకేజీ, వివరాలివే

HT Telugu Desk HT Telugu

05 April 2023, 16:33 IST

    • IRCTC Hyd -Nashik tour : హైదరాబాద్ నుంచి నాసిక్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన తేదీలు, ధరలతో పాటు షెడ్యూల్ ను పేర్కొంది.
నాసిక్ టూర్
నాసిక్ టూర్ (/www.irctctourism.com)

నాసిక్ టూర్

IRCTC Nashik Tour Pckage: నాసిక్, షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. 'SAI SHIVAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రంలోని నాసిక్ మాత్రమే కాకుండా పాటు షిర్డీ సాయిని దర్శించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TSRTC On Jeevan Reddy : జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు, ఇంకా రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించాలి- టీఎస్ఆర్టీసీ

TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TS Wines Shops Close : ఇవాళ్టి నుంచే వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?

TSRJC CET Results 2024 : టీఎస్ఆర్జేసీ సెట్‌ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

hyderabad nasik tour: 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 14వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే కింది విధంగా ఉంటుందియ.

Day 1 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 6:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 2 : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.

Day 3 : షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళ్తారు. పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 4 : 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు ఇలా….

ఇక ఈ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చెక్ చేసుకోవచ్చు.

ఐఆర్ సీటీసీ టూరిజం

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం