IRCTC Simhachalam Tour : ‘సింహాచలం’ టూర్.. 4 వేల ధరలో 2 రోజుల ట్రిప్, ప్యాకేజీ వివరాలివే
IRCTC Simhachalam Tour Latest: సింహాచలం వెళ్లాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఇందుకు సంబంధించిన తేదీలు, ధరల వివరాలను పేర్కొంది.
IRCTC Tourism Packages: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇక వీకెండ్‌లో సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ఇస్తోంది. 'వైజాగ్ బ్లిస్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
ఇది 2 రోజులు, ఒక నైట్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని ప్రతిరోజూ ఆపరేట్ చేస్తున్నారు.షెడ్యూల్ చూస్తే...
Day 01: విశాఖలోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. సోమవారం టూర్ వెళ్లే వారు మాత్రం.. రామనాయాడు ఫిల్మ్ స్టూడియో కూడా చూస్తారు. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు. ఫిషింగ్ హార్బర్ లో బోటింగ్ కూడా ఉంటుంది. తిరిగి హోటల్ కు వస్తారు. రాత్రి బోజనం తర్వాత... విశాఖలోనే బస చేస్తారు.
DAY 02: ఇక రెండోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. దర్శనం తర్వాత విశాఖపట్నం వస్తారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ ధరల వివరాలు..
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10510గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 6175, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4730గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
సంబంధిత కథనం