తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Ganga Pushkarala Yatra: గంగా పుష్కరాల యాత్ర... తెలుగు ప్రయాణికులకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ

IRCTC Ganga Pushkarala Yatra: గంగా పుష్కరాల యాత్ర... తెలుగు ప్రయాణికులకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu

29 March 2023, 17:24 IST

google News
  • Ganga Pushkarala Yatra: సమ్మర్ లో అధ్యాత్మిక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి గంగా పుష్కరాల యాత్రను ప్రకటించింది. వెళ్లే తేదీలతో పాటు ధరల వివరాలను పేర్కొంది.

గంగా పుష్కర్ యాత్ర
గంగా పుష్కర్ యాత్ర (www.irctctourism.com)

గంగా పుష్కర్ యాత్ర

IRCTC Ganga Pushkarala Yatra From Hyderabad: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. మరికొందరూ అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గంగా పుష్కరాల యాత్ర పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పూరీ, కాశీ, అయోధ్య వంటి ప్రాంతాలకు వెళ్తారు.

8 రోజులు, 7 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 18న, ఏప్రిల్ 29న అందుబాటులో ఉంది భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో సందర్శకులను తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. షెడ్యూల్ ఈ కింది విధంగా ఉంటుంది....

ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం , విజయనగరం రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. మొత్తం 656 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో స్లీపర్ బెర్తులు 432, థర్డ్ ఏసీ బెర్తులు 180, సెకండ్ ఏసీ బెర్తులు 44 ఉంటాయని ఐఆర్ సీటీసీ టూరిజం పేర్కొంది. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కవర్ అవుతాయి. ఆయా టికెట్లపై 33 శాతం రాయితీ కూడా ప్రకటించారు అధికారులు. వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ధరల వివరాలు:

ఈ టూర్ రేట్లు చూస్తే... ఎకానమీ కేటగిరిలో సింగిల్ షేర్ కు రూ. 15,300గా ఉంటే.. డబుల్, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,955గా ధరలు నిర్ణయించారు. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 24,085గా ఉంది. మిగతా వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

టికెట్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం