తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Karnataka Tour: ధర్మస్థలి, శృంగేరి, ఉడిపి ట్రిప్.. Irctc తాజా ప్యాకేజీ ఇదే

IRCTC Karnataka Tour: ధర్మస్థలి, శృంగేరి, ఉడిపి ట్రిప్.. IRCTC తాజా ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu

26 February 2023, 13:18 IST

    • hyderabad karnataka tour package: హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన ధరలు, డేట్స్ వివరాలను పేర్కొంది..
శృంగేరి ఆలయం
శృంగేరి ఆలయం (facebook)

శృంగేరి ఆలయం

IRCTC Hyderabad - Karnataka Tour: దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC)టూరిజం అందుబాటు ధరలలో ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఇందులో టూరిజం ప్రాంతాలే కాకుండా... అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, మంగళూరు వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ప్రస్తుతం ఈ టూర్ మార్చి 7వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. షెడ్యూల్ చూస్తే......

కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06.05 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి బయల్దేరుతారు. శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. St Mary's Island ను చుస్తారు. మల్పి బీచ్ అనంతరం రాత్రికి ఉడిపిలోనే బస చేస్తారు. ఉడిపి నుంచి బయల్దేరి శృంగేరికి చేరుకుంటారు. శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ్నుంచి మంగళూరుకు ప్రయాణం మొదలవుతుంది. హోటల్ కి చెకిన్ అయిన తరువాత... రాత్రి మంగళూరులోనే బస చేస్తారు. ఇక్కడ పలు ప్రాంతాలు చూస్తారు. మరోరోజు ధర్మస్థలికి వెళ్తారు. అనంతరం... మంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు రాత్రి 10. 40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటారు.

టికెట్ రేట్లు....

hyd karnataka tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 32,890 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,690 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,210గా ఉంది. కంఫర్ట్ క్లాస్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం