తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Arunachal Gateway Tour : అరుణాచల్ ప్రదేశ్ అందాలు చూసొద్దామా? తక్కువ ధరలో ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ!

IRCTC Arunachal Gateway Tour : అరుణాచల్ ప్రదేశ్ అందాలు చూసొద్దామా? తక్కువ ధరలో ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ!

05 June 2024, 13:38 IST

google News
    • IRCTC Arunachal Gateway Tour : అరుణాచల్ ప్రదేశ్ లోని సుందర ప్రదేశాలు, భారత్-చైనా సరిహద్దు, హాట్ వాటర్ స్ప్రింగ్ పర్యటనకు ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
అరుణాచల్ అందాలు చూసొద్దామా? తక్కువ ధరలో ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ!
అరుణాచల్ అందాలు చూసొద్దామా? తక్కువ ధరలో ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ!

అరుణాచల్ అందాలు చూసొద్దామా? తక్కువ ధరలో ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ!

IRCTC Arunachal Gateway Tour : ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, సెలయేర్ల సవ్వడులు, సాహస ప్రయాణాలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ 8 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. గౌహతి, తేజ్‌పూర్/భాలుక్‌పాంగ్, దిరాంగ్, తవాంగ్, బొమ్‌డిలా ప్రాంతాల్లో రోడ్ ట్యూర్ ప్యాకేజీ అందిస్తోంది. రూ. 30930 ప్రారంభ ధరతో గౌహతి నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుస్తున్నారు.

ప్యాకేజీ వివరాలు

  • ప్యాకేజీ పేరు : అరుణాచల్- గేట్‌వే టు సెరినిటీ
  • కవర్ చేయబడిన స్థలాలు - గౌహతి - తేజ్‌పూర్/భాలుక్‌పాంగ్ - దిరాంగ్ -తవాంగ్ -బొమ్‌డిలా - గౌహతి
  • ట్రావెలింగ్ - ఇన్నోవా/AC టెంపో ట్రావెలర్/మినీ బస్సు/
  • వ్యవధి -7 రాత్రులు / 8 రోజులు
  • ఫ్రీక్వెన్సీ - వీక్లీ (ప్రతి శుక్రవారం)
  • కనిష్ట పరిమాణం - ఆరుగురి నుంచి

కంఫర్ట్ క్లాస్ - ఆక్యుపెన్సీ- ఒక్కో వ్యక్తికి ధర

  • సింగిల్ రూ.44,900/-
  • డబుల్ -రూ.33,370/-
  • ట్రిపుల్ -రూ.30,930/-
  • చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు)- రూ.25,690/-
  • చైల్డ్ వితవుట్ బెడ్ (2-4 సంవత్సరాలు)- రూ.18,760/-

పర్యటన వివరాలు :

  • 01వ రోజు: గౌహతి విమానాశ్రయం – తేజ్‌పూర్ / భాలుక్‌పాంగ్

పర్యాటకులను గౌహతి విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ నుంచి పికప్ చేసుకుని.. తేజ్‌పూర్ లేదా భాలుక్‌పాంగ్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి రాత్రికి తేజ్ పూర్ లో బస చేస్తారు.

  • 02 రోజు : తేజ్‌పూర్ - దిరాంగ్

బ్రేక్ ఫాస్ట్ తర్వాత దిరాంగ్‌కు బయలుదేరతారు. మార్గంలో టిప్పి ఆర్చిడ్ సెంటర్, హాట్ వాటర్ స్ప్రింగ్ సందర్శిస్తారు. రాత్రికి దిరాంగ్ లోనే బస.

  • 03 రోజు : దిరాంగ్ - తవాంగ్

తవాంగ్‌కు ఉదయం డ్రైవ్ చేస్తారు. మార్గంలో 14000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడిన సెల్లా పాస్, జస్వంత్‌ఘర్ యుద్ధ స్మారక చిహ్నం. (4వ బెటాలియన్ గర్వాల్ రైఫిల్స్‌కు చెందిన జస్వంత్ మహావీర్ చక్ర అవార్డు గ్రహీత 1962 యుద్ధంలో చైనీయులతో ఒంటరి పోరాటం చేశారు. అతని ఆత్మ ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని కాపాడుతుందని నమ్ముతారు) తర్వాత జంగ్ జలపాతాన్ని సందర్శిస్తారు. రాత్రికి తవాంగ్‌లో బస చేస్తారు.

  • 04 రోజు : తవాంగ్

తవాంగ్ లో మోన్ఫా తెగలు ఉంటారు. "గోల్డెన్ నామ్‌గేల్ లాట్సే" మఠం- ఆసియాలోని మహాయాన శాఖలోని అతిపెద్ద లామసీరీలలో ఒకటి. ఇది 6వ దలైలామా జన్మస్థలం, ఈ మఠం 400 ఏళ్ల పురాతనమైనది. 18 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం అద్భుతంగా ఉంటుంది. 3500 మీటర్ల ఎత్తులో ఉన్న 'ది ల్యాండ్ ఆఫ్ డాన్-లైట్ మౌంటైన్స్' మీకు ప్రకృతి స్వచ్ఛతను అందిస్తుంది. మఠం, వార్ మెమోరియల్ ను పర్యాటకులు సందర్శించవచ్చు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయవచ్చు. తవాంగ్‌లో రాత్రిపూట బసచేస్తారు.

  • 05 రోజు : తవాంగ్

అల్పాహారం తర్వాత సంగేస్టర్ సరస్సు, బమ్ లా పాస్, చైనా సరిహద్దు (భారత సైన్యం అనుమతితో) విహారయాత్రకు వెళ్తారు. సంగేస్టర్ సరస్సు, లేదా మాధురి సరస్సు తవాంగ్ నుంచి బమ్ లా పాస్‌కు వెళ్లే రహదారికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బమ్ లా పాస్ అనేది రెండు సైన్యాల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు, పరస్పర చర్యల కోసం ఇండియన్ ఆర్మీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య అధికారిక పాయింట్‌. రాత్రికి తవాంగ్ లోనే బస చేస్తారు.

  • 06 రోజు : తవాంగ్ - దిరాంగ్

ఉదయాన్నే అల్పాహారం తర్వాత దిరాంగ్‌కు తిరిగి ప్రయాణం అవుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి బస దిరాంగ్‌లోనే ఉంటుంది.

  • 07 రోజు : దిరాంగ్ - గౌహతి

బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బోమ్‌డిల్లాలో స్థానిక ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఆపై గౌహతి వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రి బస గౌహతిలో ఉంటుంది.

  • 08 రోజు : గౌహతి

గౌహతిలో కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. తదుపరి ప్రయాణం కోసం గౌహతి విమానాశ్రయం / రైల్వే స్టేషన్‌కు వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్ ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుక్కింగ్, వివరాల కోసం ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.

తదుపరి వ్యాసం