తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి చిన్ననాటి స్నేహితుడు ఘాతుకం!

Hyderabad Crime : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి చిన్ననాటి స్నేహితుడు ఘాతుకం!

30 July 2024, 20:43 IST

google News
    • Hyderabad Crime : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై ఆమె చిన్ననాటి స్నేహితుడు, మరో యువకుడితో కలిసి అత్యాచారం చేశారు. పార్టీ కోసమని పిలిచి ఘాతుకానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి ఘాతుకం
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి ఘాతుకం

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం- పార్టీకి పిలిచి ఘాతుకం

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతిపై చిన్ననాటి స్నేహితులు అత్యాచారం చేశాడు. ఉద్యోగం వచ్చిందని ఓ యువతి తన స్నేహితుడికి పార్టీ ఇవ్వగా, అదే అదునుగా భావించి మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్ లో యువతిపై ఇద్దరు యుకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తు్న్న ఓ యువతి.. తనకు ఇటీవల ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో తెలిపింది. అతడు పార్టీ ఇవ్వాలని కోరడంతో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి వనస్థలిపురం పరిధిలోని ఓ హోటల్‌కు వెళ్లారు. రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఆ హోటల్ కింద అంతస్తులోని రూములో వెళ్లారు. కాసేపటి తర్వాత యువతి మత్తు నుంచి తేరుకోగా, తన గదిలో గౌతమ్ రెడ్డితో పాటు, మరో యువకుడు ఉండడాన్ని గమనించింది.

స్నేహితురాలిపై దారుణం

స్నేహితుడు, మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారని తెలుసుకున్న యవతి పెద్ద కేకలు వేసింది. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత యువతి తన స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత స్నేహితురాలి సాయంతో వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు... హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డితో పాటు మరో యువకుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన యువతికి హైదరాబాద్‌కు చెందిన స్వామి అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. తాను ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు యువతిని నమ్మించిన స్వామి, ఒకసారి కలవాలని ఆమెను హైదరాబాద్‌కు రమ్మన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతిపై అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి గట్టిగా నిలదీయడంతో... అతడు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడి తీరు పట్ల అనుమానం వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు.

ట్రావెల్స్ బస్సులో యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌లో ప్రయాణికురాలిపై డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా నుంచి నిర్మల్ వెళుతున్న హరికృష్ణ ట్రావెల్స్‌ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. బస్సు ఓయూ పోలీస్ స్టేషన్‌ పరిధిలో వెళుతున్నట్టు గుర్తించి వెంటనే బస్సును అడ్డుకున్నారు. స్లీపర్ బస్సును ఓయూ పిఎస్‌కు తరలించారు. బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో కృష్ణ అనే డ్రైవర్‌ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా నిర్మల్ వెళ్లాల్సి ఉంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో అదునుగా భావించి ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం