తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు

TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు

02 March 2024, 23:54 IST

google News
    • TS Half Day Schools : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో....మార్చి 15 నుంచి పాఠశాలలను ఒంటి పూట మాత్రమే నిర్వహిస్తామని విద్యా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపింది.
మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు
మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు

మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు

TS Half Day Schools : తెలంగాణలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు (TS Half Day Schools)నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటి పూట నిర్వహించాలని ఆదేశిచింది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభం కాగా.... మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని(Midday Meal)) గం.12.30 లకు అందజేయనున్నారు. అయితే 10వ తరగతి (SSC Exams)పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు

స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు విషయంలో మరోసారి గడువు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్‌, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ ల(TS ePass Scholarship 2023-24 Application Last Date)కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ గడువు డిసెంబర్ 31, 2023తో ముగియపోయినుంది. ఆ తర్వాత కూడా గడువు పొడిగించింది తెలంగాణ సర్కార్. జనవరి 31 వరకు అవకాశం కల్పించింది. చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోకపోవటంతో… మార్చి 31వ తేదీ వరకు గడువు పెంచింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.

కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన విద్యార్థులు 5.50 లక్షలు ఉండగా…. ఇప్పటివరకు 4,20,262 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో లక్ష మందిపైగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/. వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఈ గడువులోపు చేసుకునే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం