తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Edcet 2024 Applications : రేపటి నుంచి టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి!

TS EdCET 2024 Applications : రేపటి నుంచి టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి!

05 March 2024, 17:26 IST

google News
  • TS EdCET 2024 Applications : తెలంగాణలో రెండేళ్ల బీఈడీ ప్రవేశాలకు ఎడ్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి ఎడ్ సెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు
టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు

టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు

TS EdCET 2024 Applications : బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్ సెట్ (TS EdCET 2024) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి(March 6) నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్థులు edcet.tsche.ac.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు(Online Applications) చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి మే 6 చివరి తేదీ. ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పించడానికి మే 13 చివరి తేదీ అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్ సెట్(TS EdCET Exam) రాత పరీక్షను మే 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్ సెట్ పరీక్ష నిర్వహిస్తుంది.

ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశాల పరీక్షలకు సంబంధించి ఇప్పటికే తేదీలను ప్రకటించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇందులో భాగంగా తెలంగాణ ఎడ్ సెట్ -2024 షెడ్యూల్ ను ఇటీవల వెల్లడించింది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా… బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 6వ తేదీన ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 23వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

TS EdCET 2024 ఇలా దరఖాస్తు చేసుకోండి

Step 1 : తెలంగాణ ఎడ్ సెట్ అధికారిక వెబ్ సైట్ edcet.tsche.ac.in ను సందర్శించండి.

Step 2 : దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

Step 3 : దరఖాస్తు ఫీజు చెల్లించి, సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి

పరీక్ష విధానం

ఎడ్ సెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి తప్పనిసరిగా జులై 1, 2024 నాటికి 19 సంవత్సరాల వయస్సు ఉండాలి. అభ్యర్థికి గరిష్ట వయో పరిమితి లేదు. ఎడ్ సెట్ పరీక్ష మే 26, 2024న రెండు గంటల షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు పేపర్‌ను నిర్వహిస్తారు. మూడు విభాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఎలో ఇంగ్లిష్, పార్ట్ బిలో టీచింగ్ ఆప్టిట్యూడ్, పార్ట్ సిలో మెథడాలజీపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు పార్ట్ సి కోసం ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభంమార్చి 6
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీమే 6
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీమే 13
టీఎస్ ఎడ్ సెట్ పరీక్ష తేదీమే 23

తదుపరి వ్యాసం