తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet 2024 Registration : తెలంగాణ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ మొదలు, ఆన్ లైన్ లో ఇలా అప్లై చేసుకోండి!

TS EAPCET 2024 Registration : తెలంగాణ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ మొదలు, ఆన్ లైన్ లో ఇలా అప్లై చేసుకోండి!

26 February 2024, 14:37 IST

google News
    • TS EAPCET 2024 Registration : తెలంగాణ ఈఏపీసెట్-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈఏపీ అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్
తెలంగాణ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ (pixabay)

తెలంగాణ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్

TS EAPCET 2024 Registration : తెలంగాణలో కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్(TS EAPCET -2024) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు apcet.tsche.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు వివరాలు

ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు మే 11, 12 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఈ ఏడాది ఈఏపీసెట్ ను నిర్వహిస్తోంది.

TS EAPCET 2024 ఆన్ లైన్ దరఖాస్తు(Online Application) ఎలా చేయాలి?

Step 1: ముందుగా టీఎస్ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌ eapcet.tsche.ac.in ను సందర్శించండి.

Step 2 : హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : స్క్రీన్‌పై ఓపెన్ అయిన పేజీలో అభ్యర్థుల వివరాలు నమోదు చేసుకోండి.

Step 4 : తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి, సబ్మిట్ క్లిక్ చేయండి.

Step 5 : భవిష్యత్ అవసరాల కోసం మీ అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు(TS EAPCET 2024 Important Dates)

  • ఫిబ్రవరి 21 - నోటిఫికేషన్ విడుదల
  • ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు-ఆన్ లైన్ అప్లికేషన్లు
  • ఏప్రిల్ 8 నుంచి 12 వరకు- ఎడిట్ ఆప్షన్
  • మే 1 నుంచి -హాల్ డికెట్లు డౌన్ లోడ్
  • మే 9, 10వ తేదీల్లో- ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్షలు,
  • మే 11, 12వ తేదీల్లో -అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల‌కు ప్రవేశ ప‌రీక్షలు

అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

తదుపరి వ్యాసం