TS EAPCET 2024 : రేపే టీఎస్ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 26 నుంచి దరఖాస్తులు ప్రారంభం
TS EAPCET 2024 : తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ రేపు విడుదల చేయనున్నారు. ఈ నెల 26 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
TS EAPCET 2024 : తెలంగాణ ఈఏపీసెట్-2024(TS EAPCET) నోటిఫికేషన్ పై హైదరాబాద్ జేఎన్టీయూ అప్ డేట్ ఇచ్చింది. రేపు(బుధవారం) ఈఏపీ సెట్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. రేపు ఈఏపీ సెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు విద్యార్థులు దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్(TS EAPCET 2024 Registration) సమయంలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు(TS EAPCET 2024 Important Dates)
ఫిబ్రవరి 21 - నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు-ఆన్ లైన్ అప్లికేషన్లు
ఏప్రిల్ 8 నుంచి 12 వరకు- ఎడిట్ ఆప్షన్
మే 1 నుంచి -హాల్ డికెట్లు డౌన్ లోడ్
మే 9, 10వ తేదీల్లో- ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్షలు,
మే 11, 12వ తేదీల్లో -అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు
టీఎస్ ఈసెట్ దరఖాస్తులు
తెలంగాణ ఈసెట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్ ఈసెట్' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాగా 15 నుంచి దరఖాస్తులను స్వీకణ మొదలైంది. మే 6వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 16వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. మే 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
TS ECET 2024 registration: ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
- అర్హులైన అభ్యర్థులు మొదటగా… ఈసెట్ అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ లోకి వెళ్లాలి.
- టీఎస్ ఈసెట్ 2024 registration లింక్ పై క్లిక్ చేయాలి. అంతకంటే ముందు పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- Payment Reference ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- నాలుగు దశల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుంది.
- సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత… అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టీఎస్ ఈసెట్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు
- తెలంగాణ ఈసెట్ -2024 నోటిఫికేషన్ - ఫిబ్రవరి 14, 2024.
- దరఖాస్తుల స్వీకరణ - ఫిబ్రవరి 15, 2024.
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఏప్రిల్ 16, 2024.
- ఆలస్యం రుసుంతో - ఏప్రిల్ 28, 2024.
- దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం - ఏప్రిల్ 24 నుంచి 28, 2024.
- ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - మే 6, 2024.