తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hussain Sagar Lazar Show :హుస్సేన్ సాగర్ అలలపై కోహినూర్ కథ, హైదరాబాద్ లో మరో టూరిస్ట్ అట్రాక్షన్

Hussain Sagar Lazar Show :హుస్సేన్ సాగర్ అలలపై కోహినూర్ కథ, హైదరాబాద్ లో మరో టూరిస్ట్ అట్రాక్షన్

11 March 2024, 20:29 IST

google News
    • Hussain Sagar Lazar Show : హైదరాబాద్ పర్యాటకంలో మరో ప్రాజెక్టు చేరనుంది. హుస్సేన్ సాగర్ లేక్ లో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు.
హుస్సేన్ సాగర్
హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్

Hussain Sagar Lazar Show : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో హైదరాబాద్ (Hyderabad Tourism)పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను(Lazar Sound Light show) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం (మార్చి 12) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించి కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం (Kohinoor Diamond)లభించిన సంగతి తెలిసిందే.

కోహినూర్ వజ్రం కథ

తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ(Kohinoor Story).. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసిన ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత ఎస్ఎస్ కంచి రాశారు. ప్లే బ్యాక్ సింగర్ సునీత (Singar Sunitha)గాత్రాన్ని అందించగా.. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో.. అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి కానీ ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి.

లేజర్ షో

కోహినూర్ కథతో పాటుగా.. తెలంగాణ చరిత్ర, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది. దీంతో పాటుగా ఈ లేజర్ షో(Lazar Show)కు వచ్చే పర్యాటకులకు సరైన సైనేజెస్, 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటుచేశారు. దీన్ని కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు

రొబోటిక్ నాజిల్స్ అండ్ లైటింగ్ : వెయ్యికి పైగా రొబోటిక్ నాజిల్స్, DMX ప్రొటోకాల్ తో అడ్వాన్స్‌డ్ అండర్ వాటర్ లైటింగ్ సిస్టమ్స్ ద్వారా అద్భుతమైన రంగు రంగుల లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

  • లేజర్ టెక్నాలజీ : ఆకర్షణీయమైన లేజర్ రంగుల కోసం.. మూడు 40W RGB లేజర్స్ ను ఏర్పాటుచేశారు.
  • గ్యాలరీ, రూఫ్ టాప్ రెస్టారెంట్ : 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ గ్యాలరీ, సంజీవయ్య పార్క్, మల్టీ మీడియా షోను పనోరమిక్ వ్యూ కోసం రూఫ్ టాప్ రెస్టారెంట్ ఏర్పాటుచేశారు.
  • హెచ్డీ ప్రొజెక్షన్ : ఒక్కొక్కటి 34 వేల ల్యుమెన్స్ సామర్థ్యం గల 3 HD ప్రొజెక్టర్స్ ద్వారా.. వాటర్ స్క్రీన్ పై స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రొజెక్షన్ ఉండేలా ఏర్పాట్లున్నాయి. బీమ్ మూవీంగ్ హెడ్‌లైట్స్ ద్వారా విజువల్ ఎఫెక్ట్ అందంగా ఉండనుంది.
  • కథాపరమైన వర్ణన : కోహినూర్ వజ్రానికి సంబంధించన కథ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్ర్య సంగ్రామం వంటి ఘట్టాలను సాగర్ అలలపై అందమైన లైటింగ్ ప్రొజెక్షన్ ద్వారా.. పర్యాటకులను ఆకట్టుకునేలా వివరిస్తారు. దీనికి తోడు 5.1 డాల్బీ స్టయిల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆడియో ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా స్పష్టంగా ఉండబోతోంది.
  • రికార్డ్-బ్రేకింగ్ వాటర్ ఫౌంటేన్ : 260 అడుగుల ఎత్తు, 540x130 డైమెన్షన్‌ తో దేశంలోనే.. అతిపెద్ద, అతి ఎత్తయిన వాటర్ ఫౌంటేన్.. ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నాయి.
  • చారిత్రక ప్రాధాన్యత : స్టోరీ టెల్లింగ్ విషయంలో, చారిత్రక ఘట్టాలకు సరైన ప్రాధాన్యత విషయంలో.. సాంకేతిక సృజనాత్మకతకు పెద్దపీట వేశారు.

తదుపరి వ్యాసం