Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
15 September 2024, 17:36 IST
- Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఈ నెల 29లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో అప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి.
హైదరాబాద్ ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఏడాది ట్రేడ్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు అర్హులైన ఐటీఐ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో https://www.ecil.co.in/jobs.html దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు
అభ్యర్థులు 31.10.2024 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు. గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 30 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఇస్తారు.
అప్రెంటిస్‌షిప్ వ్యవధి
- అప్రెంటిస్‌షిప్ శిక్షణాకాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. 01 నవంబర్, 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
అర్హత
- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అంటే NCVT సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం ఇలా
- ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.
- 07.10.2024 నుంచి 09.10.2024 వరకు ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్ – 500 062. ఫోన్ నెం.: 040 2718 6454/2279
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి?
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- STEP 1 : అవసరమైన విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.apprenticeshipindia.gov.in
- లో ముందుగా నమోదు చేసుకోవాలి.
- STEP 2 : పైన పేర్కొన్న పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు ఈసీఐఎల్ వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 13.09.2024 నుంచి ప్రారంభం అయ్యింది. దరఖాస్తుకు సెప్టెంబర్ 29 చివరి తేదీ.
ట్రేడ్ ఖాళీల వివరాలు ఇలా
ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీలు : 437 (UR- 175; EWS- 44, OBC- 120, SC- 65, ST- 33)
1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162
2. ఎలక్ట్రీషియన్- 70
3. ఫిట్టర్- 70
4. మెకానిక్ (ఆర్ అండ్ ఏసీ)- 17
5. టర్నర్- 17
6. మెషినిస్ట్- 17
7. మెషినిస్ట్(గ్రైండర్)- 13
8. సీఓపీఏ- 45
9. వెల్డర్- 22
10. పెయింటర్- 4