తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Phd Notification: హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల

HCU Phd Notification: హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల

HT Telugu Desk HT Telugu

07 September 2022, 7:58 IST

    • hyderabad central university: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి (జులై 2022 సెషన్) వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ లో ప్రవేశాలు కల్పించనుంది.
హెచ్ సీయూ పీహెచ్డీ ప్రవేశాలు
హెచ్ సీయూ పీహెచ్డీ ప్రవేశాలు (twitter)

హెచ్ సీయూ పీహెచ్డీ ప్రవేశాలు

hyderabad central university admissions 2022: పీహెచ్ డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అర్హతలు, సబ్జెక్టులు, రుసుం, దరఖాస్తుల చివరి తేదీలను పేర్కొంది. ఆయా వివరాలను చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

సబ్జెక్టులు:

ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్, మైక్రోబయాలజీ, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్ ,అప్లైడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్

అర్హతలు - 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ - రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. JRF అర్హత పొందిన అభ్యర్థులకు పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు రుసం: జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్‌ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.275 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.09.2022.

ప్రవేశ పరీక్షల తేదీలు: అక్టోబర్, 2022.

అర్హత గల అభ్యర్థులు http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తులు, హాల్ టికెట్లు, పరీక్షల షెడ్యూల్, ఇంటర్వూల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.