సెంట్రల్ వర్శిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-cuet for admissions in central universities ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సెంట్రల్ వర్శిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్

సెంట్రల్ వర్శిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్

HT Telugu Desk HT Telugu
Mar 21, 2022 05:43 PM IST

2022-23 నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల పరిధిలో అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సోమవారం ప్రకటించింది.

యూజీసీ కార్యాలయం
యూజీసీ కార్యాలయం (HT_PRINT)

న్యూఢిల్లీ:  2022-23 నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయని, 12వ తరగతి మార్కులకు వెయిటేజీ ఉండదని యూజీసీ ప్రకటించింది.

సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందని యూజీసీ ఛైర్‌పర్సన్‌ ఎం.జగదీష్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ విద్యార్థులపై భారాన్ని తగ్గిస్తుందని వివరించారు.

ప్రైవేట్, స్టేట్ లేదా డీమ్డ్ వర్సిటీలతో సహా ఇతర ఉన్నత విద్యా సంస్థలు సీయూఈటీ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వవచ్చని తెలిపారు. సీయూఈటీ ప్రవేశ పరీక్షను ప్రాంతీయ భాషల్లో సైతం నిర్వహిస్తారు.

సీయూఈటీ ప్రస్తుత సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ విధానంపై ప్రభావం చూపదని కుమార్ తెలిపారు. రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపదని వివరించారు. సీయూఈటీ వివరాలను మార్చి 22న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటిస్తుందని తెలిపారు.

IPL_Entry_Point