తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, విద్యార్థి సంఘాల ఆందోళన!

Hyderabad News : మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, విద్యార్థి సంఘాల ఆందోళన!

29 September 2024, 8:20 IST

google News
    • Hyderabad News : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ శ్రీ చైతన్య క్యాంపస్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంటే... వైరల్ ఫీవర్స్ అని కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఫుడ్ సెఫ్టీ అధికారులు కాలేజీలో తనిఖీలు చేశారు.
మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఆరోపణలు, విద్యార్థి సంఘాల ఆందోళన
మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఆరోపణలు, విద్యార్థి సంఘాల ఆందోళన

మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఆరోపణలు, విద్యార్థి సంఘాల ఆందోళన

Hyderabad News : హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీ చైతన్య కాలేజీ క్యాంపస్​లో గురువారం ఫుడ్​ పాయిజన్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 100 విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారికి కాలేజీ క్యాంపస్​లోనే వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కొందరిని మెరుగైన వైద్యానికి బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య క్యాంపస్ కు చేరుకుని ఆందోళనకు దిగాయి. దీంతో కాలేజీ యాజమాన్యం మాదాపూర్​ పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కాలేజీ మేనేజ్మెంట్​స్పందించింది. కాలేజీ ఎలాంటి ఫుడ్​ పాయిజన్ జరగలేదని, విద్యార్థులు వైరల్ ఫీవర్స్ బాధపడుతున్నారని తెలిపింది. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తు్న్నామని వెల్లడించింది.

శ్రీచైతన్య సిబ్బంది, విద్యార్థి సంఘాలు బాహాబాహీ

మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వార్తలు రావడంతో కాలేజీ క్యాంపస్ లో జీహెచ్ఎంసీ ఏఎంఎచ్ఓ, ఫుడ్ ఇన్సెక్టర్ తనిఖీలు చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, ఫైర్ సెఫ్టీ లేనికారణంగా కళాశాలకు రూ.2 లక్షలు జరిమానా విధించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. కాలేజీ క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా...శ్రీ చైతన్య సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాసేపు వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. శ్రీచైతన్య కళాశాల సిబ్బంది తమను దుర్భాషలాడారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

కాలేజీకి రూ.2 లక్షల ఫైన్

శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్​ను ఫుడ్​సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. కిచెన్ లో ఆహార పదార్థాల సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపారు. కాలేజీ కిచెన్, క్యాంటీన్​లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. ఫైర్ ​సేఫ్టీ, ట్రేడ్​ లైసెన్స్ లేని కారణంగా రూ. 2లక్షలు జరిమానా విధించారు.

గీతం వర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగల్లి వర్ష (19) గీతం యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్కడే బాలికల హాస్టల్ లో ఉంటుంది. చదువులో ఎప్పుడు ముందుడే వర్ష శుక్రవారం ఉదయం కాలేజీకి వచ్చి మధ్యాహ్నం తిరిగి హాస్టల్ గదికి వెళ్లింది. అనంతరం రూమ్ మేట్స్ భోజనానికి వెళ్లిన తర్వాత వర్ష హాస్టల్ గదిలో ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మరల మధ్యాహ్నం అందరూ విద్యార్థులు క్లాసులకు హాజరు కాగా… వర్ష రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ రూమ్ కి వెళ్లి తలుపు కొట్టారు. ఆమె తలుపు తీయకపోవడంతో వాచ్ మెన్ వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వర్ష ఉరి వేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తదుపరి వ్యాసం