తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acp Vishnu Murthy : అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకో..లేదంటే తోలు తీస్తాం- ఏసీపీ విష్ణుమూర్తి అనుచిత వ్యాఖ్యలు

ACP Vishnu Murthy : అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకో..లేదంటే తోలు తీస్తాం- ఏసీపీ విష్ణుమూర్తి అనుచిత వ్యాఖ్యలు

22 December 2024, 19:08 IST

google News
  • ACP Vishnu Murthy : హీరో అల్లు అర్జున్, సినీ పరిశ్రమపై ఏసీపీ విష్ణు మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..లేదంటే తీవ్ర పదజాలం వాడారు.తోలు తీస్తామన్నారు.

అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకో..లేదంటే తోలు తీస్తాం- ఏసీపీ విష్ణుమూర్తి అనుచిత వ్యాఖ్యలు
అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకో..లేదంటే తోలు తీస్తాం- ఏసీపీ విష్ణుమూర్తి అనుచిత వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకో..లేదంటే తోలు తీస్తాం- ఏసీపీ విష్ణుమూర్తి అనుచిత వ్యాఖ్యలు

ACP Vishnu Murthy : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. శనివారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. హీరో అల్లు అర్జున్‌ వల్ల తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాజాగా ఈ వివాదంపై ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్‌ ఖైదీ అని, కేసు విచారణలో ఉండగా ప్రెస్‌మీట్‌ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. థియేటర్ వద్ద జనం పెరుగుతున్నారని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్‌ వినలేదని ఆరోపించారు.

డబ్బు మదంతో మాట్లాడుతున్నారు

గత కొన్ని రోజులుగా పోలీసులపై అల్లు అర్జున్ నిందలు వేస్తున్నారని ఏసీబీ విష్ణుమూర్తి మండిపడ్డారు. డబ్బు మదంతో ఓ హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. బందోబస్తుకు కొన్ని నియమాలు ఉంటాయని, అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి తెలిపారు. పోలీసులను నోటికి వచ్చిన్నట్టు కొందరు నటులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. అందరు పనులు చేసుకుంటే పోలీసులు రోడ్ల మీద ఉంటారన్నారు. సమాజం కోసం పోలీసులు అన్ని వేళలో అందుబాటులో ఉంటారని ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు.

అల్లు అర్జున్ తోలు తీస్తాం

హీరో అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల తోపులాట జరిగి మహిళా చనిపోయిందన్నారు. బౌన్సర్లతో దౌర్జన్యం చేయించడం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్రదేశాల్లో సెలెబ్రెటీలు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. పోలీసులు తమ విధులను సరిగ్గానే చేశారన్నారు. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రీల్స్ కట్ చేస్తామంటూ తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారని, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..లేదంటే తోలు తీస్తామన్నారు. సినిమా వాళ్ల బట్టలు ఊడతీస్తామని తీవ్ర పదజాలం వాడారు.

సినిమా వాళ్ల దాదాగిరి ఏంటి?

సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ లో భూములు ఇచ్చారని ఏసీపీ అన్నారు. సినిమా వాళ్లు వాపు చూసి బలం అనుకోవదన్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటన్నారు. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారని మండిపడ్డారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీయమని తామేమైనా బతిమిలాడామా? అన్నారు. అసలు అల్లు అర్జున్ కు తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా? అని ప్రశ్నించారు. పోలీస్ అధికారులు తనకు చెప్పలేదని అంటున్నారని, అసలు నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్‌మార్ ఖాన్ అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. తెలంగాణ పౌరులు సౌమ్యులు కాబట్టి ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారంటూ ఏసీబీ తీవ్రంగా స్పందించారు.

తదుపరి వ్యాసం