ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు
26 March 2024, 15:43 IST
- ఐపీఎల్ -2024 లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
రేపు తలపడనున్న ఎస్ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్
ఐపీఎల్ -2024 లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియా జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంత్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి స్టేడియానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు. ఈ అవకాశాన్ని క్రికెట్ అభిమానులు వినియోగించుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు.
ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు : సజ్జనార్
‘ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ - ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై తిరిగి రాత్రి 11:30 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలు దేరుతాయి. ఈ ప్రత్యేక బస్సులను అభిమానులు వినియోగించుకొని మ్యాచ్‌ను వీక్షించాలని సంస్థ కోరుతుంది " అంటూ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఈ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు.
• మెహదీపట్నం - స్టేడియం - 4 బస్సులు
• ఘట్‌కేసర్ - స్టేడియం - 4 బస్సులు
• హయత్ నగర్ - స్టేడియం - 2 బస్సులు
• NGIO కాలనీ - స్టేడియం - 4 బస్సులు
• ఇబ్రహీంపట్నం - స్టేడియం - 2 బస్సులు
• లాబ్ క్వార్టర్స్ - స్టేడియం - 2 బస్సులు
• కోటి - స్టేడియం - 2 బస్సులు
• అఫ్జల్ గంజ్ - స్టేడియం - 2 బస్సులు
• లక్డి కా పుల్ - స్టేడియం - 2 బస్సులు
• దిల్‌సుఖ్ నగర్ - స్టేడియం - 2 బస్సులు
• జీడిమెట్ల - స్టేడియం - 4 బస్సులు
• KPHB - స్టేడియం - 2 బస్సులు
• మేడ్చల్ - స్టేడియం - 2 బస్సులు
• మియాపూర్ - స్టేడియం - 2 బస్సులు
• JBS - స్టేడియం - 4 బస్సులు
• హకింపెట్ - స్టేడియం - 2 బస్సులు
• ECIL ఎక్స్ రోడ్స్ - స్టేడియం - 2 బస్సులు
• బోయింపల్లి - స్టేడియం - 2 బస్సులు
• చార్మినార్ - స్టేడియం - 4 బస్సులు
• చాంద్రాయణగుట్ట - స్టేడియం - 2 బస్సులు
• BHEL - స్టేడియం - 2 బస్సులు
• కొండాపూర్ - స్టేడియం - 2 బస్సులు
• ఎల్బి నగర్ - స్టేడియం - 2 బస్సులు
- రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా