BRAOU B.Ed Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు… నోటిఫికేషన్ విడుదల, షెడ్యూల్ ఇదే
27 January 2024, 6:26 IST
- Ambedkar Open University Admission Updates: బీఈడీ ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. 2023-24 విద్యా సంవత్సరానికి బీఈడీ (ODL) ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
బీఈడీ ప్రవేశాలు
BRAOU B.Ed Admissions Updates: దూర విద్యలో బీఈడీ చేయాలనుకునేవారికి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. 2022- 24 అకడమిక్ ఇయర్ కు సంబంధించి బీఈడీ (ODL -Open and Distance Learning) ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 21వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
ముఖ్య వివరాలు:
ప్రవేశాల ప్రకటన - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్
కోర్సు - బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (B.ed ఓడీఎల్ 2023-24)
అర్హతలు - అడ్మిషన్ తీసుకునే అభ్యర్థి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి.
కోర్సు వ్యవధి - 2 సంవత్సరాలు
మీడియం - తెలుగు మాధ్యమం.
ఎంపిక ప్రక్రియ - ఎంట్రెన్స్ ఎగ్జామ్
ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు - 21.ఫిబ్రవరి.2024.
రూ.500 ఫైన్ తో దరఖాస్తులకు తుది గడువు - 26. ఫిబ్రవరి.2024.
హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ - 01.మార్చి.2024.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ- 05.మార్చి.2024.
ప్రిలిమినరీ కీ - 07.మార్చి.2024.
ఫలితాలు -15.మార్చి.2024.
అడ్మిషన్ కౌన్సెలింగ్ - మార్చి చివరి వారం, 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు
BRAOU Admissions 2024: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాదిలో జనవరి - ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన ప్రకటన వచ్చింది. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. జనవరి 31, 2024 వరకు గడువు విధించారు. www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కోర్సులు ఇవే...
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. జనవరి 31,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.
అర్హతలు...
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తులు ప్రారంభం - 08 -01-2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.జనవరి,2024.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/