BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… ఈ ఏడాది నోటిఫికేషన్ వచ్చేసింది-ambedkar open university online admission applications for jan 2024 session ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Braou Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… ఈ ఏడాది నోటిఫికేషన్ వచ్చేసింది

BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… ఈ ఏడాది నోటిఫికేషన్ వచ్చేసింది

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 21, 2024 11:43 AM IST

Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. జనవరి 31, 2024వ తేదీని తుది గడువుగా ప్రకటించింది.

అంబేడ్కర్ వర్శిటీ ప్రవేశాలు
అంబేడ్కర్ వర్శిటీ ప్రవేశాలు (https://www.braouonline.in/)

BRAOU Admissions 2024: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ నుంచి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాదిలో జనవరి - ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన ప్రకటన వచ్చింది. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. జనవరి 31, 2024 వరకు గడువు విధించారు. www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

yearly horoscope entry point

కోర్సులు ఇవే...

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. జనవరి 31,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.

అర్హతలు...

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

- దరఖాస్తులు ప్రారంభం - 08 -01-2024.

- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.జనవరి,2024.

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

- అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/

ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.

Whats_app_banner