BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG ప్రవేశాలు... మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు-braou admissions last date extended till 20 october 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Braou Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, Pg ప్రవేశాలు... మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG ప్రవేశాలు... మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 11, 2023 09:30 AM IST

Ambedkar Open University Admissions 2023: అంబేడ్కర్ దూర విద్య కోర్సుల్లో చేరే గడువును మరోసారి పొడిగించారు అధికారులు. అక్టోబరు 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ ప్రవేశాలు
బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ ప్రవేశాలు (Twitter)

BRAOU Admissions 2023- 24: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. అయితే ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుల గడువు పొడిగించగా... అక్టోబరు 4వ తేదీతో గడువు ముగిసింది. అయితే ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో అభ్యర్థులు ఈనెల 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.

yearly horoscope entry point

కోర్సులు ఇవే...

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.

అర్హతలు...

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2023

- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.అక్టోబర్, 2023.

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

- అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/

ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.

Whats_app_banner