తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : దేశంలో స్విగ్గీ రాజకీయాలు, కాంగ్రెస్ 20-20 ఫార్మాట్ కు మారాలి - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : దేశంలో స్విగ్గీ రాజకీయాలు, కాంగ్రెస్ 20-20 ఫార్మాట్ కు మారాలి - సీఎం రేవంత్ రెడ్డి

12 November 2024, 22:29 IST

google News
  • CM Revanth Reddy : 'కాంగ్రెస్ నాయ‌కులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇప్పుడు 20-20 ఫార్మాట్ న‌డుస్తోంది. మేం ఫార్మాట్ మార్చుకోవాలి' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకే పరిమితం అయ్యిందని, ఇది మోదీ ఓటమే అన్నారు.

దేశంలో స్విగ్గీ రాజకీయాలు, కాంగ్రెస్ 20-20 ఫార్మాట్ కు మారాలి - సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో స్విగ్గీ రాజకీయాలు, కాంగ్రెస్ 20-20 ఫార్మాట్ కు మారాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో స్విగ్గీ రాజకీయాలు, కాంగ్రెస్ 20-20 ఫార్మాట్ కు మారాలి - సీఎం రేవంత్ రెడ్డి

"నేను టీఆర్ఎస్ లో పనిచేయలేదు. కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశాను. తెలంగాణ ఉద్యమం సాగుతున్న స‌మ‌యంలో విద్యార్థులు, పారిశ్రామిక‌వేత్తలు ఉద్యమానికి మ‌ద్దతు ఇచ్చారు. దానిని టీఆర్ఎస్ పెట్టుబ‌డిగా మార్చుకుంది" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలో ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలపై స్పందించారు.

ఇది మోదీ ఓటమే

"ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయన్న బీజేపీ 240 సీట్లు సాధించింది. కాంగ్రెస్ స్థానాలు 40 నుంచి వంద‌కు చేరింది. నెంబ‌ర్లు చూస్తే ఎవ‌రు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓట‌మి కాదు.. మోదీ ఓట‌మి. ప్రతి దానికి మోదీ ముద్ర వేశారు. మోదీ గ్యారంటీ అన్నారు. మోదీ గ్యారంటీకి వారంటీ పూర్తయింద‌ని నేను ఎన్నిక‌ల‌కు ముందే చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీశ్ కొంద‌రి స‌హ‌కారంతో ప్రభుత్వం న‌డుస్తోంది. ఇది మోదీ ఓట‌మే"-సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో స‌ర్కార్ ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. ప‌దేళ్లలో మోదీ దేశ ప్రజ‌ల‌ను ఎలా మోసం చేశారో చెప్పగ‌లిగామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ అన్నదాత‌ల‌కు వ్యతరేకంగా ప‌నిచేసిందని ఆరోపించారు. రాజ్యాంగం ర‌ద్దుకు మోదీ ప్రభుత్వం ఎలా ప్రయ‌త్నించిందో ప్రజలకు చెప్పగ‌లిగామన్నారు. బీజేపీ ర‌హ‌స్య అజెండాను బ‌య‌ట‌పెట్టామన్నారు. బీజేపీ ర‌హ‌స్య అజెండా వేరు.. ఎన్నిక‌ల ముందు చెప్పే అజెండా వేరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

" కాంగ్రెస్ ఫార్మాట్ మార్చుకోవాలి. కాంగ్రెస్ నాయ‌కులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇప్పుడు 20-20 ఫార్మాట్ న‌డుస్తోంది. మేం ఫార్మాట్ మార్చుకోవాలి. బీజేపీ ఉంచ‌డ‌మో.. ఖ‌తం చేయ‌డ‌మో తీరులో ఉంటుంది. మాకు మాన‌వీయ స్పర్శ ఉంటుంది. మేం అలా చేయం. అవ‌స‌రాలు.. వ్యాపార రీతిలో బీజేపీ రాజ‌కీయాలు ఉంటాయి. కాంగ్రెస్ తాత‌ల తండ్రులను గుర్తుపెట్టుకుంటుంది. వారి సంక్షేమానికి కృషి చేస్తుంది"- సీఎం రేవంత్ రెడ్డి

మ‌హారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నిక‌ల‌పై

'ప్రతి నేత కుర్చీపై ఆలోచిస్తారు. కుర్చీ కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు దేశానికి మంచిది కాదు. ఎన్నిక‌లు గెలుపుఓట‌ముల ప్రాధాన్యం కాదు. విభ‌జ‌న రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల త‌ర్వాత ఎన్నిక‌ల గురించే మోదీ ఆలోచిస్తారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స‌మీక్ష ఉండదు. ఎంత మంచి ఔష‌ధానికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు విభ‌జ‌న కార్యక్రమాల‌కు గ‌డువు ముగిసింది' అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

"గ‌తంలో అమ్మమ్మ నానమ్మలు వంట చేసేంత వ‌ర‌కు రెండు మూడు గంట‌లు వెయిట్ చేసేవాళ్లం. లేదా మంచి హోట‌ల్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే రెండు నిమిషాల్లో వ‌స్తోంది. మ‌నం అమ్మ, అమ్మమ్మ, నాన‌మ్మల‌పై ఆధార‌ప‌డ‌డం లేదు.. స్విగ్గీపై ఆధార‌ప‌డుతున్నాం. ఇప్పడు స్విగ్గీ రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయి. సర‌ళీక‌ర‌ణ త‌ర్వాత సిద్ధాంత‌ప‌ర‌మైన రాజ‌కీయాలు, ఆలోచ‌న‌లు, అనుసంధాన‌త‌ త‌గ్గిపోయింది. మాకు ఎంత త్వర‌గా ఉద్యోగం వ‌స్తుంది. ఎంత త్వర‌గా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్ రైటింగ్ చేసేవాళ్లం. జెండాలు క‌ట్టేవాళ్లం. ర్యాలీలు చేసేవాళ్లం. మా జేబులోని డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకొని ప‌ని చేసేవాళ్లం. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జ‌రుగుతోంది" - సీఎం రేవంత్ రెడ్డి

"బీజేపీ భావోద్వేగాల‌ను రెచ్చగొట్టడం ద్వారా ల‌బ్ధిపొందుతుంది. ఎన్నిక‌ల ముందు పుల్వామా, అయోధ్య రామ‌మందిరం.. ఇలా ఏదో ఒక భావోద్వేగం రెచ్చగొడుతున్నారు.. బీజేపీకి జాతీయ ప్రయోజ‌నాల క‌న్నా భావోద్వేగ రాజ‌కీయాలు చేయ‌డం తెలుసు. రాజ‌కీయాలు భావోద్వేగాల‌తో ముడిప‌డిన‌వి."- సీఎం రేవంత్ రెడ్డి

తదుపరి వ్యాసం