తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ambedkar Statue : ఆకాశమంత 'అంబేడ్కర్'.. భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం Kcr, ప్రకాశ్ అంబేడ్కర్

Ambedkar Statue : ఆకాశమంత 'అంబేడ్కర్'.. భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం KCR, ప్రకాశ్ అంబేడ్కర్

HT Telugu Desk HT Telugu

14 April 2023, 16:00 IST

google News
    • Ambedkar Statue Inauguration: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం బౌద్ధ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆకాశమంత 'అంబేడ్కర్
ఆకాశమంత 'అంబేడ్కర్

ఆకాశమంత 'అంబేడ్కర్

Ambedkar Statue in Hyderabad: జాతి గర్వించేలా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ జయంతి(ఏప్రిల్ 14) సందర్భంగా ఆవిష్కరించగా… ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు భారీగా పాల్గొన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం… బౌద్ధ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రకాష్‌ అంబేద్కర్‌ చేతుల మీదుగా బౌద్ధ గురువులను సన్మానించారు.

అంబేద్కర్‌ స్మృతి వనంలో అంబేడ్క ర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ కలియదిరిగారు. ఆయన వెంట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర నేతలంతా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ, లైబ్రరీ తదితరాలను పరిశీలించారు. అంబేద్కర్‌ స్మృతి వనంలోని స్క్రీన్‌పై అంబేద్కర్‌కు సంబంధించిన క్లిప్స్‌ను వీక్షించారు.

ప్రత్యేకతలివే…

ఈ విగ్రహ స్థాపనకు ఏప్రిల్ 14 , 2016 లో శంకు స్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం. భూమి నుండి 175 అడుగుల ఎత్తు. పీఠం ఎత్తు 50 అడుగులుగా ఉంది.ఇది దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం పనులు చేపట్టారు. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు. వినియోగించిన స్టీల్ 791 టన్నులు. ఇత్తడి 96 మెట్రిక్ టన్నులుగా ఉంది.ఇది దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం పనులు చేపట్టారు. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు. వినియోగించిన స్టీల్ 791 టన్నులు. ఇత్తడి 96 మెట్రిక్ టన్నులుగా ఉంది.ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటేన్స్ , సాండ్ స్టోన్ వర్క్, జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్ సౌకర్యం ఉంది. విగ్రహానికి చేరుకోడానికి మెట్ల దారి, ర్యాంప్ నిర్మించారు.

విగ్రహం కింద పీఠం లోపల గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిలో అంబేద్కర్ రచనలు అందుబాటులో ఉంటాయి. బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్ కూడా ఉంది. మొత్తం ఫాల్స్ సీలింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ స్మృతి వనంలో దాదాపు 450 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం