తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్ - ఈ 4 స్టెప్పులతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే

PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్ - ఈ 4 స్టెప్పులతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే

18 February 2024, 15:11 IST

google News
    • PM Vishwakarma Scheme Applications: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన  పీఎం విశ్వకర్మ స్కీమ్ లో భాగంగా రూ.3 లక్షల లోన్ పొందవచ్చు. సాంప్రదాయ చేతిపనులు, చేతివృత్తుల్లో నిమగ్నమైన వారికి ఆర్థిక సాయం, కావాల్సిన శిక్షణ అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడండి…
పీఎం విశ్వకర్మ దరఖాస్తులు
పీఎం విశ్వకర్మ దరఖాస్తులు (https://pmvishwakarma.gov.in/)

పీఎం విశ్వకర్మ దరఖాస్తులు

Pm Vishwakarma Yojana Scheme Updates: సాంప్రదాయ చేతిపనులు, చేతివృత్తుల్లో నిమగ్నమైన వారికి ఆర్థిక సాయం, ప్రోత్సహించేందుకు విశ్వకర్మ యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకానికి 18 రకాల కులస్తులు అర్హులు అవుతారు. ఈ స్కీమ్ కు ఎంపికైతే 3 లక్షల లోన్ తీసుకోవచ్చు. దరఖాస్తు ఎలా చేసుకోావాలో ఇక్కడ చూద్దాం….

ఈ స్కీమ్ కు మొత్తం 18 రకాల కులస్తులు అర్హులు అవుతారు. సాంప్రదాయ కులవృత్తులైన వ శిల్పాలు విగ్రహాలు తయారు చేసే వారు, బుట్టలు, చాపలు, మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వారు, చీపిర్లు తయారీదారులు, దోబీ, టైలర్, చేపవలను తయారు చేయు వారు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు క్షవుర వృత్తిదారులు, సంప్రదాయ బొమ్మలు,పూల దండలు, రజకులు పడవల తయారీదారులు, ఇంటి తాళాలు, వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు అర్హులు అవుతారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండి ఉండాల్సిందే.

అప్లికేషన్ ప్రాసెస్ ఇదే….

PM Vishwakarma Scheme Applications Process: విశ్వకర్మ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారు మొదటగా https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి,

దరఖాస్తు చేసుకోవాలంటే… మొదటగా పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. https://pmvishwakarma.gov.in/Login లింక్ పై క్లిక్ చేసి రిజిస్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లాగిన్ క్రియేట్ అవుతుంది.

ఈ వివరాలతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

మొత్తం నాలుగు దశలు ఉంటాయి. ఫస్ట్ దశలో మొబైల్ ప్రామాణీకరణ, ఆధార్ ఈకేవైసీ(EYC) చేయాల్సి ఉంటుంది.

రెండో దశలో ఆర్టిసన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ అనే ఆప్షన్ పై నొక్కి….. రిజిస్ట్రేషన్ ఫారమ్ ను పూర్తి చేయాలి.

మూడో దశలో పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇక నాల్గోవ దశలో స్కీమ్ కాంపోనెంట్‌ల(scheme component) కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఈ స్కీమ్ కు సంబంధించి సందేహాలు ఉంటే 18002677777 లేదా 17923కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

ఈ దరఖాస్తు ప్రక్రియ మీసేవా కేంద్రాల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు.

అర్హతలు…

-దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, బ్యాంకు పాస్ కలిగి ఉండాలి.

-ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

-18 సంవత్సరాలు నిండి ఉండాలి.

-గడిచిన ఐదేళ్లలో ఎలాంటి రుణాలు తీసుకుని ఉండకూడదు.

-ఇంటిలో ఒకరు మాత్రమే అర్హులు.

-ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే పతకానికి అనర్హులు.

-దరఖాస్తు చేసుకున్నాక మూడు దశల్లో స్క్రీనింగ్ చేసి సెలెక్ట్ చేస్తారు.

-అర్హత పొందిన వారికి 15 రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణ లో రోజుకు 500 రూపాయలు ఉపకార వేతనం అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు,

-కులవృత్తుల వారికి పనిముట్లు (టూల్స్) కొనుక్కునేందుకు 15,000 రూపాయలు అందిస్తారు.

-తొలివిడతగా 5శాతం రైతుతో వడ్డీ పై లక్ష రూపాయలను అందిస్తారు. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

-రెండో విడతగా రెండు లక్షల రూపాయలను అందిస్తారు. మీరు తీసుకున్న 30 నెలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం