తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Telangana President Bandi Sanjay Letter To Cm Kcr

Bandi Sanjay Letter : ముఖ్యమంత్రి గారు.. మీ పాలనలో ఏం సాధించారు..?

HT Telugu Desk HT Telugu

03 June 2023, 13:14 IST

    • Bandi sanjay Latest News: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు. తొమ్మిదేళ్ల పాలనపై వాస్తవాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. 
బండి సంజయ్
బండి సంజయ్ (twitter)

బండి సంజయ్

Bandi sanjay Fires On KCR: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రూ.లక్షదాకా రుణమాఫీ చేస్తానని, ఫ్రీ యూరియా, విత్తనాలిస్తానని హామీలిచ్చి మాట తప్పింది నిజం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఇక సంజయ్ రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. మొత్తం 21 ప్రశ్నలను సంధించారు బండి సంజయ్. 21 రోజుల దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ఏం సాధించారో చెప్పాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

2 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

వడ్ల కుప్పల వద్ద ప్రాణాలు విడుస్తున్న రైతుల దుస్థితికి కారణం ఎవరు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను బండి సంజయ్ విమర్శించారు.ఇక్కడి రైతులను ఆదుకోని సర్కార్… పంజాబ్ లోని రైతులను ఆదుకోవటమేంటని దుయ్యబట్టారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే లాకప్ డెత్ లు చేయడమా? ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, జైళ్లకు పంపడమేనా? అని నిలదీశారు. గత పాలనతో పోలిస్తే మూడింతల కరెంట్ ఛార్జీలను పెంచడమే కాకుండా ఏసీడీ చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరుతో జనంపై భారం మోపడమే విద్యుత్ రంగంలో మీరు సాధించిన విజయమా? అన్న బండి సంజయ్…విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలవుతోందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మీ 9 ఏళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి? ఎంత మంది ఉపాధి కోల్పోయారు? ఎన్ని పరిశ్రమలొచ్చాయి? కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని బండి సవాల్‌ విసిరారు.

“ప్రభుత్వ దవాఖానాల్లో వసతుల్లేక బాలింతలు చనిపోతున్నందుకు, రోగమొస్తే ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఆస్తులమ్మి చికిత్స చేయించుకునే దుస్థితి వచ్చినందుకు 'వైద్యారోగ్య దినోత్సవం' జరుపుకుంటున్నారా?మీ కుటుంబ పాలనలో బాగుపడ్డదెవరు? దగాపడ్డదెవరు? 9 ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?” అని కేసీఆర్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు.