Dasoju Sravan : బ్లాక్ మెయిల్ రెడ్డి, తొండి సంజయ్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి- దాసోజు శ్రవణ్-hyderabad brs leader dasoju sravan criticizes revanth reddy bandi sanjay false allegations on kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Brs Leader Dasoju Sravan Criticizes Revanth Reddy Bandi Sanjay False Allegations On Kcr

Dasoju Sravan : బ్లాక్ మెయిల్ రెడ్డి, తొండి సంజయ్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి- దాసోజు శ్రవణ్

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 07:04 PM IST

Dasoju Sravan : రాష్ట్రంలో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి మూడోసారి కేసీఆర్ ను గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.

దాసోజు శ్రవణ్
దాసోజు శ్రవణ్

Dasoju Sravan : బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ డివిజన్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో సోమవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా 9 ఏండ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కోరారు.

ట్రెండింగ్ వార్తలు

మూడు వారాల పాటు దశాబ్ది ఉత్సవాలు

జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిమీదా ఉన్నదని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలని.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం తీసుకరావాలని దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కూడా పరమేశ్వరుడే అన్నారు. అందుకే భారతదేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా కేసీఆర్ ప్రజల గురించి ఆలోచిస్తూ వారిని కష్టాల నుంచి బయటపడేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నారన్నారు.

తెలంగాణ దేశానికే తలమానికం

"కేసీఆర్ తెలంగాణను ఎంతగా అభివృద్ధి చేశారో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్..ఈరోజు మూడు లక్షలకు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు , రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2000 లకు తీసుకొచ్చారు కేసీఆర్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారు. అలాంటి కేసీఆర్ మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణ అంటే భారతదేశానికే తలమానికంగా ఉంది. వరి ఉత్పత్తిలో, కరెంట్ వినియోగంలో, ఉత్పత్తిలో ఇలా ఎందులో చూసిన తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండేలా కేసీఆర్ చేశారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, మన ఊరు - మన బడి, రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన, మిషన్ భగీరథ ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్నో ఆసరా పెన్షన్లు తీసుకొచ్చిన కేసీఆర్ పై ఈరోజు కాంగ్రెస్ , బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలి"-దాసోజు శ్రవణ్

రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలు ప్రతి రోజు, ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని దాసోజు శ్రవణ్ కార్యకర్తలకు సూచించారు. బ్లాక్ మెయిల్ రెడ్డి , తొండి సంజయ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.

IPL_Entry_Point