తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Govt On Hra | కొత్త పీఆర్సీ ప్రకారం వేతన స్కేళ్లు.. ప్రభుత్వం ఎంత మేరకు సవరించిందంటే..?

Govt On HRA | కొత్త పీఆర్సీ ప్రకారం వేతన స్కేళ్లు.. ప్రభుత్వం ఎంత మేరకు సవరించిందంటే..?

HT Telugu Desk HT Telugu

20 February 2022, 21:15 IST

google News
    • హెచ్ఆర్ఏ, సీసీఏ, పింఛను సంబంధిత అంశాలపై ప్రభుత్వం కొత్త జీవోలను జారీ చేసింది. 2024 జూన్ వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
హెచ్ఆర్ఏపై ప్రభుత్వ జీవో
హెచ్ఆర్ఏపై ప్రభుత్వ జీవో (twitter)

హెచ్ఆర్ఏపై ప్రభుత్వ జీవో

11వ పీఆర్సీ అమలుకు సంబంధించి వేతనాలు, హెచ్‌ఆర్‌లో మార్పులు, పింఛన్లు ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించి.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24శాతం మేర హెచ్‌ఆర్‌ఏకు సంబంధించి.. ఉత్తర్వులను జారీ చేసింది.

వాస్తవానికి.. 11వ పీఆర్సీలో 16 శాతం మాత్రమే పెంపు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే.. మంత్రుల కమిటీతో అంగీకారం కుదిరింది. దీని ప్రకారం.. 24 శాతం వర్తింప చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు హెచ్‌ఆర్‌ఏ గరిష్ట పరిమితి రూ.25వేలకు నిర్ధారించారు. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. అంతేకాదు.. ఏపీ భవన్‌, హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్.. ప్రభుత్వ ఉద్యోగులకు.. 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని చెప్పారు.

2024 జూన్ ఒకటో తేదీ నుంచి.. హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సిటీ కంపన్సేటరీ అలవెన్స్‌ సైతం హెచ్‌వోడీలు, సచివాలయ ఉద్యోగులకు, విశాఖ, విజయవాడ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు గ్రేడ్ పేను బేస్ చేసుకుని ఉంటుంది. 13 వేర్వేరు మున్సిపాలిటీలకు సైతం ఇది వర్తిస్తుంది.

పెన్షనర్లకు అడిషినల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను కూడా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు విశ్రాంత ఉద్యోగులకు వర్తించనుంది. 70 ఏళ్ల వారికి అదనంగా 7 శాతం పెన్షన్‌ చెల్లింపు ఉంటుంది. 75 ఏళ్ల వారికి 12 శాతం పెన్షన్‌ చెల్లించనున్నారు. 80 ఏళ్లు- 20 శాతం, 85 ఏళ్లు- 25 శాతం, 90 ఏళ్లు- 30 శాతం, 95 ఏళ్లు- 35 శాతం, 100 ఏళ్ల విశ్రాంత ఉద్యోగికి అదనంగా 50 శాతం పెన్షన్‌ చెల్లింపులు జరుగుతాయి.

తదుపరి వ్యాసం