తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hra| హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు.. ఆ ఉద్యోగులకు మాత్రమే

HRA| హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు.. ఆ ఉద్యోగులకు మాత్రమే

HT Telugu Desk HT Telugu

30 January 2022, 6:37 IST

google News
    • ఉద్యోగుల హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెంపు కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడీ ఉద్యోగులకు మాత్రమ వర్తించనుంది. హెచ్ఓడీ అధికారుల సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను సవరించింది.
హెచ్ఆర్ఏ పెంపు
హెచ్ఆర్ఏ పెంపు (YSRCP Official site)

హెచ్ఆర్ఏ పెంపు

పీఆర్సీపై అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొత్త పీఆర్సీలో హెచ్ఆర్ఏ(హౌస్ రెంట్ అలవెన్సు) పెంపుపై నిరసన బాట చేపట్టారు. తాజాగా ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే హెచ్ఓడీ కార్యాల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏను రెట్టింపు చేసింది. పీఆర్సీ పెంచాలని ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేస్తోన్న తరుణంలో హెచ్ఆర్ఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

8 నుంచి 16 శాతానికి పెంపు..

ఈ మేరకు శనివారం సాయంత్రం రాష్ట్ర ఆర్థిక ప్రన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగుల హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెంపు కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడీ ఉద్యోగులకు మాత్రమ ేవర్తించనుంది. హెచ్ఓడీ ఉద్యోగుల సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను సవరించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావితి తరలించారు. ఫలితంగా అక్కడ పనిచేస్తున్న ఆంద్ర ఉద్యోగులను ఉన్నపళంగా అమరావతి తిరిగి వచ్చేశారు. దీంతో ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం పలు అలవెన్సులు ఇచ్చింది. తాజాగా ఇందులో భాగంగానే వారికి ఈ హెచ్ఆర్ఏను పెంచింది.

హెచ్ఓడీలకు హెచ్ఆర్ఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతాయని భావించిన వారికి కొంత ఉపశమనం కలగనుంది, హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల రాజధాని పరిసర ప్రాంత ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి.

పెంచినా లభించేది తక్కువే.. 

ఈ విధంగా హెచ్ఆర్ఏ రెట్టింపు చేయడం కూడా ఉద్యోగుల్లో కొంత అసంతృప్పి ఛాయలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 30 శాతం వరకు హెచ్ఆర్ఏ లభించేంది. ఇటీవల వరకు అదే అలవెన్సు వర్తించేది. కానీ కొత్త పీఆర్సీ నిబంధనల ప్రకారం కేవలం 8 శాతం మాత్రమే వర్తించనుంది. తాజాగా 16 శాతానికి పెంచినప్పటికీ గతంతో పోలిస్తే 14 శాతం తక్కువే లభిస్తుంది. దీంతో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం