తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allam Narayana : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు

Allam Narayana : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు

HT Telugu Desk HT Telugu

25 August 2022, 21:34 IST

google News
    • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం
ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీం కోర్టు తీర్పుపై మీడియా అల్లం నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రికి మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు. చాలా ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

తదుపరి వ్యాసం