తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dating Scam With Girls : అమ్మాయిలతో పబ్ కు రప్పించి..'బిల్' మోత మోగించి! హైదరాబాద్ లో డేటింగ్ పేరుతో కొత్తరకం మోసం..!

Dating Scam With Girls : అమ్మాయిలతో పబ్ కు రప్పించి..'బిల్' మోత మోగించి! హైదరాబాద్ లో డేటింగ్ పేరుతో కొత్తరకం మోసం..!

HT Telugu Desk HT Telugu

07 June 2024, 20:54 IST

google News
    • Dating Scam With Girls in Hyderabad: హైదరాబాద్ లో కొత్త రకం మోసం వెలుగు చూసింది. డేటింగ్ పేరుతో  పబ్ కు తీసుకెళ్తూ… భారీగా బిల్ చేస్తున్నారు. ఇదంతా కూడా పబ్ యాజమానుల డైరెక్షన్ లోనే నడుస్తున్నట్లు తేలింది.
హైదరాబాద్ లో కొత్త రకం మోసం
హైదరాబాద్ లో కొత్త రకం మోసం

హైదరాబాద్ లో కొత్త రకం మోసం

Hyderabad Crime News: ఇప్పటివరకు అమ్మాయిలను ఎరగా వేసి సైబర్ మోసలకు పాల్పడిన ఎన్నో ఘటనలు మనం చూశాం. అయితే తాజాగా హైదరాబాద్ లో వాటికి మించిన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

డేటింగ్ యాప్ ముసుగులో కొందరు అమ్మాయిలు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే కాలంలో చాలా మంది అబ్బాయిలు… అమ్మాయిల మోజులో పడిపోయి డేటింగ్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదే అదునుగా చేసుకొని కొంత మంది పబ్ యజమానులు అమ్మాయిలతో కుమ్మక్కై భారీ మోసాలకు తెర లేపుతున్నారు.

ఈ క్రమంలోనే డేటింగ్ పేరుతో పరిచయం అయిన ఓ అమ్మాయి… ఓ పబ్ ఓనర్ చేసిన దోపిడీ బట్టబయలు అయింది. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి టెండర్ అనే డేటింగ్ యాప్ లో ఇటీవలే కాలంలో రితిక అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.

డేటింగ్ పేరిట కొత్తరకం మోసం…..

పరిచయం ఏర్పడిన మరుసటి రోజే సదరు యువతి కలుసుకుందాం అని చెప్పింది. దీంతో ఇద్దరూ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. కాసేపు మెట్రో స్టేషన్ లోనే మాట్లాడుకున్నాక ఆ యువతి గ్యాలేరియా మాల్ లో ఉన్న మోష్ పబ్ కు వెళ్దామని కోరడంతో ఇద్దరూ పబ్ కు వెళ్లారు. అక్కడ ఆ యువకుడికి తియ్యని మాటలు చెప్పిన రితికా అతని చేత ఖరీదైన మద్యాన్ని ఆర్డర్ చేయించింది.

ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తరువాత యాజమాన్యం బిల్ వేయగా.... సాధారణం కంటే మూడింతలు అధికంగా బిల్ వేశారు. ఇదేంటని ప్రశ్నించినా.... సదరు యువకుడి నుంచి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకున్నారు. ఇదంతా జరుగుతున్న యువతి రీతికా మాత్రం తనకు… పబ్ కు ఎలాంటి సంబంధం లేనట్టుగా నటించింది.

తనకు ఇలా జరగడంపై అనుమానం వ్యక్తం చేసిన యువకుడు ఆ పబ్ గురించి ఆన్ లైన్ లో రీసెర్చ్ చేశాడు. అయితే తనలాగే అనకే మంది ఇలాగే ట్రాప్ లో పడి మోసపోయారాని గ్రహించాడు. చేసేదేం లేక తనకు జరిగిన మోసాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకున్నాడు. తనలా ఎవరూ మోసపోవద్దని సూచించాడు. ప్రస్తుతం ఆ పబ్ బిల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం