Hyderabad Crime News : ఈతకు దిగాలంటూ ఫ్రెండ్స్ చాలెంజ్ - మద్యం మత్తులో యువకుడు మృతి-a young man died after jumping into a pond under the influence of alcohol in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime News : ఈతకు దిగాలంటూ ఫ్రెండ్స్ చాలెంజ్ - మద్యం మత్తులో యువకుడు మృతి

Hyderabad Crime News : ఈతకు దిగాలంటూ ఫ్రెండ్స్ చాలెంజ్ - మద్యం మత్తులో యువకుడు మృతి

HT Telugu Desk HT Telugu
May 23, 2024 08:03 PM IST

Hyderabad Crime News : స్నేహితులు విసిరిన చాలెంజ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని ఈతకు దిగాలంటూ సవాల్ చేశారు హైదరాబాద్ కు చెందిన సాజిద్ అనే యువకుడు నీటిలోకి దిగి మృతి చెందాడు.

 మద్యం మత్తులో చెరువులో దూకి యువకుడు మృతి
మద్యం మత్తులో చెరువులో దూకి యువకుడు మృతి (representative image)

Hyderabad Crime News : తోటి స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో చెరువులో దూకి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఒడ్డుపైన ఉన్న మరో స్నేహితుడు… దూకుతూ ఉండగా ఫోన్ లో రికార్డు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే….. హైదరాబాద్ లోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు.…విహార యాత్ర కోసం కర్ణాటకకు వెళ్లారు. కమలాపూర్ చేడుగుప్ప సమీపంలో వీరంతా కలిసి మద్యం సేవించారు. అనంతరం దగ్గరలోనే ఉన్న ఓ చెరువులో కొందరు ఈతకు దిగారు.

ఈ గ్రూపులోనే ఉన్న సాజిద్ మాత్రం మద్యం మత్తులో ఊగుతూ రోడ్డుపైనే ఉండిపోయాడు. కాగా అక్కడే ఉన్న మరో స్నేహితుడు చెరువులోకి దూకాలని రెచ్చగొట్టాడు. దమ్ముంటే ఈతకు రావాలని సవాల్ చేశాడు. అప్పటికే పీకల దాకా మద్యం సేవించి ఉన్న సాజిద్… స్నేహితుడు రెచ్చగొట్టడంతో చెరువులోకి దూకాడు. నీటిని మింగిన సాజిద్…. అందరూ చూస్తుండగానే మునిగిపోయాడు.

ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్జించిన మరో స్నేహితుడు…. సాజిద్ ను కాపాడాలని స్థానికులతో పాటు వాహనదారులను వేడుకున్నాడు. అప్పటికే సాజిద్ ప్రాణాలు కోల్పోయాడు.

ఘోర రోడ్డు ప్రమాదం.....కొడుకు మృతి, తండ్రికి సీరియస్

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణం చేస్తున్న తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల వివరాల ప్రకారం…. మెట్ పల్లి పట్టణానికి చెందిన శివరామకృష్ణ తన కొడుకు అక్షయ్ తో కలిసి గురువారం ఉదయం నిజామాబాద్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం బండి లింగాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని విరి కారు ఢీ కొట్టింది.

అప్పటికే అక్షయ్ ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు నిర్ధారించారు. కొన ఊపిరితో ఉన్న తండ్రి శివరామకృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.శివ రామకృష్ణ ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొల్లాపూర్ లో బీఆర్ఎస్ నేత దారుణ హత్య....

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావు మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ కీలక నేత,మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.

తన గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్ద శ్రీధర్ రెడ్డిని బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి హత్య చేశారు. అయితే ఈ హత్య రాజకీయ హత్యా? లేక భూ వివాదాలతో జరిగిందా ..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి జూపల్లి అనుచరులు ఈ హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.

టీ20 వరల్డ్ కప్ 2024