తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Women’s T20 World Cup 2023: ఆస్ట్రేలియా మంచి టీమే.. కానీ వాళ్లను ఓడిస్తాం: రిచా ఘోష్

Women’s T20 World Cup 2023: ఆస్ట్రేలియా మంచి టీమే.. కానీ వాళ్లను ఓడిస్తాం: రిచా ఘోష్

Hari Prasad S HT Telugu

22 February 2023, 18:36 IST

google News
    • Women’s T20 World Cup 2023: ఆస్ట్రేలియా మంచి టీమే.. కానీ వాళ్లను ఓడిస్తామని అంటోంది ఇండియన్ వుమెన్స్ టీమ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇండియా సెమీఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే.
ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిచా ఘోష్
ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ (AFP)

ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిచా ఘోష్

Women’s T20 World Cup 2023: మహిళల టీ20 వరల్డ్ కప్ లో వరుసగా మూడోసారి ఇండియా సెమీఫైనల్ చేరిన సంగతి తెలుసు కదా. మంగళవారం (ఫిబ్రవరి 21) ఐర్లాండ్ ను 5 పరుగుల తేడాతో చిత్తు చేసి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. అయితే ఈ సెమీఫైనల్లోనే ఇండియన్ టీమ్ కు అసలు పరీక్ష ఎదురుకానుంది. అక్కడ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.

అయితే ఆస్ట్రేలియా బలమైన టీమే అయినా.. సెమీస్ లో వాళ్లను ఓడిస్తామని ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిచా ఘోష్. మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టోర్నీ హాట్ ఫేవరెట్. అలాంటి టీమ్ తో సెమీఫైనల్ అంటే ఇండియాకు సవాలే. గత రెండు టీ20 వరల్డ్ కప్ లను గెలిచి హ్యాట్రిక్ టైటిల్స్ పై ఆసీస్ కన్నేసింది. 2020 నుంచి 42 టీ20లు ఆడిన ఆస్ట్రేలియా కేవలం నాలిగింట్లో మాత్రమే ఓడింది.

గ్రూప్ స్టేజ్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లలో భారీ విజయలు సాధించింది. గ్రూప్ 1లో టాప్ లో నిలిచి ఇండియాతో సెమీఫైనల్ కు సిద్ధమైంది. ఇండియా గ్రూప్ 2లో రెండోస్థానంలో నిలిచి సెమీస్ కు క్వాలిఫై అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ ఆరో టీ20 వరల్డ్ కప్ పై కన్నేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను ఓడిస్తామన్న నమ్మకంతో ఉంది టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్.

"ఆస్ట్రేలియాను మేము ఓడించగలం. మేము వాళ్లను ఓడించలేమన్నది సరి కాదు. ఎందుకంటే ఇండియాలో జరిగిన గత సిరీస్ లో ఆ పని చేసి చూపించాం. వాళ్లది బలమైన టీమే అయినా మేము వాళ్లను ఓడించగలం" అని రిచా ఘోష్ స్పష్టం చేసింది. గత మూడేళ్లలో ఆస్ట్రేలియాను ఇండియా మూడుసార్లు ఓడించడం విశేషం. గత వరల్డ్ కప్ ఫైనల్లో ఒత్తిడికి తలొగ్గి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడినా.. ఈసారి ఆ ఒత్తిడిని అధిగమిస్తామని రిచా తెలిపింది.

"మేము మా మైండ్ సెట్ ను మెరుగుపరచుకుంటున్నాం. ఎందుకంటే మ్యాచ్ ఎవరిదైనా కావచ్చు. ఆటలో మానసికంగా బలంగా ఉన్న టీమే గెలుస్తుంది. అందుకే దానిపై పని చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి" అని రిచా చెప్పింది. సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే 180 వరకూ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

టాపిక్

తదుపరి వ్యాసం