Wimbledon 2024: వింబుల్డన్ ఫైనల్‌లో జకోవిచ్, అల్కారజ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా రోహిత్ శర్మ
13 July 2024, 13:15 IST
Wimbledon 2024: వింబుల్డన్ 2024 మెన్స్ ఫైనల్లోకి సెర్బియా స్టార్ జకోవిచ్ అడుగుపెట్టాడు. తుది పోరులో స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కారజ్‌తో తలపడనున్నాడు. మహిళల ఫైనల్ క్రెజికోవా, షావోలినీ మధ్య జరుగనుంది.
వింబుల్డన్ 2024 ఫైనల్
Wimbledon 2024: సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. వింబుల్డన్ 2024 ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. తుది పోరులో గత ఏడాది ఛాంపియన్ కార్లోస్ అల్కారజ్‌తో జకోవిచ్ తలపడనున్నాయి.
2023 ఫైనల్ తర్వాత మరోసారి…
2023లో జరిగిన వింబుల్డన్ ఫైనల్‌లో జకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్ టైటిల్‌ను అల్కారజ్ గెలుచుకున్నాడు. మొదటిసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. వింబుల్డన్ 2023 ఫైనల్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఐదు సెట్ల పాటుజరిగిన ఈ పోరులో అల్కారజ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు జకోవిచ్.
గత ఏడాది ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి అల్కారజ్‌పై రివేంజ్ తీర్చుకోవాలని జకోవిచ్ బరిలో దిగుతోన్నట్లు తెలుస్తోంది. 2024 వింబుల్డన్ ఫైనల్ పోరు గత ఏడాదికి మించి టెన్నిస్ అభిమానులకు థ్రిల్ పంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫైనల్ ఫైట్ ఆదివారం జరుగనుంది.
సెమీస్‌లో...
సెమీ ఫైనల్‌లో జకోవిచ్...ఇటలీ ప్లేయర్, 25వ సీడ్ ప్లేయర్ ముసెట్టిపై విజయం 6-4, 7-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. రెండో సెట్‌లో మాత్రమే జకోవిచ్‌కు ముసెట్టి గట్టి పోటీ ఇచ్చాడు. మరో సెమీస్‌లో రష్యా అటగాడు, ఐదో సీడ్ మెద్వదేవ్‌పై అల్కారజ్ గెలుపొందాడు.
తొలి సెట్‌లో గెలుచుకొని అల్కారజ్‌కు మెద్వదేవ్ షాకిచ్చాడు. ఆ తర్వాత పుంజుకున్న అల్కారజ్ వరుసగా మూడు సెట్‌లు గెలిచి మ్యాజ్ సొంతం చేసుకున్నాడు. 6-7, 6-3, 6-4 ,6-4 తేడాలో మెద్వదేవ్‌ను అల్కారజ్ ఓడించి రెండో ఏడాది ఫైనల్‌లో అడుగుపెట్టాడు.
మహిళల సింగిల్స్...
మహిళల వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ శనివారం జరుగనుంది. ఈ ఫైనల్ పోరులో క్రెజికోవాతో పావోలినీ తలపడనుంది. వీరిద్దరు వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. పావోలినీ మహిళ సింగిల్స్‌లో ఏడు ర్యాంకులో ఉండగా...క్రెజికోవా 31వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
రోహిత్ శర్మ స్పెషల్ అట్రాక్షన్...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింబుల్డన్ సెమీస్ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. కార్లోస్ అల్కారజ్, మెద్వదేవ్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ రోహిత్ శర్మ వీక్షించాడు. రాయల్ బాక్స్‌లో కూర్చొని మ్యాచ్ ను ఏంజాయ్ చేశాడు. రోహిత్ శర్మ వింబుల్డన్ ఫైనల్‌కు హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలను స్కిప్ చేసిన రోహిత్ వింబుల్డన్ మ్యాచ్‌లకు హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.
టాపిక్