When and Where to watch FIFA world Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
09 November 2022, 21:56 IST
- When and Where to watch FIFA world Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడండి. ఈ మెగా టోర్నీ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
ఫిఫా వరల్డ్ కప్ కోసం ముస్తాబవుతున్న ఖతార్
When and Where to watch FIFA world Cup 2022: ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ పండుగకు టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 32 టీమ్స్ పాల్గొంటున్న ఈ వరల్డ్‌కప్ కోసం కోట్ల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ మంది చూసే ఆటగా పేరున్న ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఫిఫా వరల్డ్‌కప్ ఎక్కడ?
ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌కు ఖతార్ ఆతిథ్యమిస్తోంది. అక్కడి 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అల్ బైత్ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ తుమామా స్టేడియం, అల్ రయ్యన్ స్టేడియం, లూసేల్ స్టేడియం, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, స్టేడియం 974, అల్ జానౌబ్ స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ లూసేల్ స్టేడియంలో జరగనుంది.
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఎక్కడ చూడాలి?
ఇండియాలో ఫిఫా వరల్డ్‌కప్ 2022 బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను వయాకామ్ నెట్‌వర్క్ 18 సొంతం చేసుకుంది. దీంతో ఈసారి ఈ మ్యాచ్‌లు స్పోర్ట్స్18, స్పోర్ట్స్18 హెచ్‌డీ ఛానెల్స్‌లో టెలికాస్ట్ అవుతాయి. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై చూడాలనుకుంటే వూట్, జియో సినిమాల్లోనూ ఫిఫా వరల్డ్‌కప్ స్ట్రీమ్ అవుతుంది. వూట్ సెలక్ట్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే మీ మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్ టీవీల్లో ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడొచ్చు.
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఎప్పుడు?
ఫిఫా వరల్డ్‌కప్ 2022 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుగుతుంది. తొలి మ్యాచ్ నవంబర్ 20న ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ ఐదు భిన్నమైన సమయాల్లో మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30, సాయంత్రం 6.30, రాత్రి 8.30, 9.30, అర్ధరాత్రి 12.30 గంటలకు జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్‌లు రాత్రి 8.20, అర్ధరాత్రి 12.30 గంటలకు.. ఫైనల్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతుంది.