తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umran Malik Dangerous In Nets: ఉమ్రాన్‌‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు.. దేవుడే వారిని కాపాడాలి.. వివ్రాంత్ వ్యాఖ్యలు

Umran Malik Dangerous in Nets: ఉమ్రాన్‌‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు.. దేవుడే వారిని కాపాడాలి.. వివ్రాంత్ వ్యాఖ్యలు

05 January 2023, 16:39 IST

google News
    • Umran Malik Dangerous in Nets: ఉమ్రాన్ మాలిక్‌పై అతడి స్నేహితుడు, సహచర ప్లేయర్ వివ్రాంత్ శర్మ ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. నెట్స్‌తో అతడు చాలా కఠినంగా బౌలింగ్ చేస్తాడని, బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడని తెలిపాడు.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (PTI)

ఉమ్రాన్ మాలిక్

Umran Malik Dangerous in Nets: ఉమ్రాన్ మాలిక్.. ఈ యువ సంచలన గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‍‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ పేసర్.. ఇటీవలే గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఏ ఇతర భారత బౌలర్‌కు సాధ్యం కానీ రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఉమ్రాన్ బౌలింగ్ గురించి అతడి స్నేహితుడు, సహచర సన్‌రైజర్స్ ఆటగాడు వివ్రాంత్ శర్మ ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. ఉమ్రాన్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తుంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తాడని పేర్కొన్నాడు.

"నెట్స్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసేటప్పుడు బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా కనిపిస్తాడు. నో బాల్ టెన్షన్ ఉండదు కాబట్టి అది 22 గజాల లేదా 18 గజాల పిచ్ అనేదాంతో సంబంధం లేకుండా అత్యంత పదునైన బంతులను సంధిస్తాడు. ఆ సమయంలో కేవలం భగవంతుడే వారిని రక్షించాలి. నెట్స్‌లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడని, అతడు బౌలింగ్‌లో ఆడిన తర్వాత 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే పేసర్‌ను ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది." అని వివ్రాంత్ శర్మ చెప్పాడు.

వివ్రాంత్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ జమ్మూ కశ్మీర్ తరఫున ఆడారు. ఇద్దరూ చాలా కాలంగా స్నేహితులు. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున ఆడుతుండగా.. వివ్రాంత్‌ను ఐపీఎల్ 2022 మినీ వేలంలో ఆరెంజ్ ఆర్మీ సొంతం చేసుకుంది.

ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన తొలి టీ20లో తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతడికి తోడు శివమ్ మావి 4 వికెట్లతో రాణించడంతో లంక జట్టుపై భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేను పుణె వేదికగా గురువారం నాడు తలపడనుంది.

తదుపరి వ్యాసం