తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: ఆసియా కప్‌లో విరాట్ ఈ రికార్డులు బ్రేక్ చేస్తాడా.. అందుకుంటే చరిత్ర

Virat kohli: ఆసియా కప్‌లో విరాట్ ఈ రికార్డులు బ్రేక్ చేస్తాడా.. అందుకుంటే చరిత్ర

26 August 2022, 18:44 IST

    • విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశముంది. కెరీర్‌లో అతడు 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌తో అతడు ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

విరాట్ కోహ్లీ

ఆసియా కప్ 2022రు సర్వత్రా రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా శనివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ శ్రీలంక-ఆఫ్గనిస్థాన్ మధ్య జరగనుంది. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం ఆదివారం జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ దాయాది దేశాల మధ్య పోరుతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడనేందుకు కూడా ఆత్రుతగా చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు అందుకునే అవకాశముంది. వంద అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ మాత్రమే సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇంగ్లాండ్ పర్యటనలో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు కోహ్లీ. ఆ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆసియా కప్ టోర్నీల్లో విరాట్‌కు మంచి రికార్డు ఉంది. అతడు 60 సగటుతో మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ఇటీవల కాలంలో ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ.. ఈ సారి మాత్ర తన ప్రతాపం చూపిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

- విరాట్ ఇప్పటి వరకు 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రాబోయే మ్యాచ్ ద్వారా అతడు 100వ టీ20ని పూర్తి చేసుకోనున్నాడు. ఈ జాబితాలో ముందుగా రాస్ టేలర్ మాత్రమే ఉన్నాడు.

- కోహ్లీ మరో ఏడు సిక్సర్లు బాదితే టీ20ల్లో రోహిత్ తర్వాత 100 సిక్సర్లు బాదిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

- ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ మరో 374 పరుగులు సాధిస్తే 11 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

తదుపరి వ్యాసం