తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umran Malik: ఆ విషయం స్టెయిన్ ముందే చెప్పాడు.. జట్టులో చోటుపై ఉమ్రాన్ వ్యాఖ్యలు

Umran Malik: ఆ విషయం స్టెయిన్ ముందే చెప్పాడు.. జట్టులో చోటుపై ఉమ్రాన్ వ్యాఖ్యలు

08 June 2022, 13:05 IST

google News
    • భారత జట్టులో తనకు చోటు దక్కిన విషయం తెలిసినప్పుడు డేల్ స్టెయిన్ తన పక్కనే ఉన్నాడని ఉమ్రాన్ మాలిక్ గుర్తు చేసుకున్నాడు. ఆ విషయం ఆయన తనకు ముందే చెప్పాడని తెలిపాడు.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (AFP)

ఉమ్రాన్ మాలిక్

ఐపీఎల్ 2022కి ముందు ఉమ్రాన్ మాలిక్.. ఎవ్వరికీ పెద్దగా తెలియని పేరు. అనామక క్రికెటర్‌గా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన అతడు.. ఈ లీగ్ ముగిసే సమయానికి స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారత జట్టుకు కూడా ఎంపికయ్యాడు. జూన్ 9 నుంచి జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశమొచ్చింది. ఇప్పటికే ట్రైనింగ్ సెషన్‌లో అతడు శిక్షణ పొందుతున్న వీడియోను బీసీసీఐ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అదిరిపోయే పేస్‌తో ఆకట్టుకుంటున్న ఉమ్రాన్.. టీమిండియాకు ఎంపిక కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జట్టుకు సెలెక్ట్ అయినప్పుడు తనతో సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ తన పక్కనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

"భారత జట్టుకు ఎంపికైనప్పుడు నేను సన్‌రైజర్స్ టీమ్‌తో కలిసి బస్సులో ఉన్నాను. స్టెయిన్ నా పక్కనే ఉన్నారు. అప్పుడే విషయం తెలిసింది. ప్రతి ఒక్కరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. ఆ సమయంలో స్టెయిన్ విషెస్ చెబుతూ.. ముందే చెప్పా కదా.. నువ్వు ఇండియాకు ఆడతావని గుర్తు చేశారు. దేవుడి దయ వల్ల టీమిండియా తరఫున అత్యుత్తమంగా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను." అని ఉమ్రాన్ మాలిక్ అన్నాడు.

"టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పరాజ్ మెంబ్రే‌తో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు ఉమ్రాన్. "ద్రవిడ్ సర్‌ను కలవడం నాకు ఆనందంగా ఉంది. ఆయన ఓ లెజెండ్. నా ఆటతీరు ఇలాగే కొనసాగాలని చెప్పారు. పరాస్ నా వెన్నంటే ఉండి నాకు మద్దతు ఇచ్చారు. ప్రతి విషయంలోనూ మార్గదర్శకంగా నిలిచారు. ఫలితంగా నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది." అని ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు.

ఉమ్రాన్ మాలిక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ ఏడాది ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

 

టాపిక్

తదుపరి వ్యాసం