Virat Kohli: 'డబుల్' కొట్టిన కోహ్లీ.. ఇన్‌స్టాలో విరాట్ అరుదైన ఘనత
08 June 2022, 12:54 IST
- టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న అథ్లెట్లలో మూడో స్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ రన్నింగ్ మెషిన్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు వచ్చి చేరాయి. తాజాగా విరాట్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. తన జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు అతడికి అమితంగా వచ్చి చేరారు. దాదాపు 200 మిలియన్ల అనుచరులతో అరుదైన ఘనత సాధించాడు.
మంగళవారంతో కోహ్లీ 200 మిలియన్ల(20 కోట్ల) మార్కును అధిగమించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కోహ్లీ.. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టాడు. “200 మిలియన్ల ఫ్యామిలీ అయ్యాం. ఇన్‌స్టాలో ఇంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.” అని కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.
ఈ సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లనున్న అథ్లెట్లలో కోహ్లీ మూడో స్థానంలో నిలించాడు. విరాట్ కంటే ముందు ఫుట్ బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఉన్నారు. రొనాల్డో 450 మిలియన్ల మంది, మెస్సీ 333 మిలియన్ల ఫాలోవర్లతో టాప్-2 స్థానాల్లో ఉన్నారు.
గతేడాది యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. గ్రూప్ దశలోనే భారత్ నిష్క్రమించడంతో విరాట్ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్నాడు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. అనంతరం టెస్టు కెప్టెన్ బాధ్యతలను కూడా అప్పజెప్పింది. ఇదిలా ఉంటే జూన్ 9 నుంచి 19 మధ్య దక్షిణాఫ్రికా.. భారత్ లో పర్యటించనుంది. ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు.
టాపిక్