తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar Impress On Sanju Following: సంజూ ఫాలోయింగ్‌కు సూర్యకుమార్ ఫిదా.. వీడియో వైరల్

Suryakumar impress on Sanju Following: సంజూ ఫాలోయింగ్‌కు సూర్యకుమార్ ఫిదా.. వీడియో వైరల్

28 September 2022, 7:15 IST

    • Fans chant Sanju Samson Name: టీమిండియా.. సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టీ20 కోసం కేరళ తిరువనంతపురంలో చేరుకోగా.. అక్కడ అభిమానులు సంజూ శాంసన్ పేరును నినదించారు. దీంతో సూర్యకుమార్ అభిమానులకు సంజూ ఫొటోను చూపుతూ వారిలో మరింత జోష్‌ను పెంచాడు.
సంజూ శాంసన్ ఫొటో చూపిస్తున్న సూర్యకుమార్ యాదవ్
సంజూ శాంసన్ ఫొటో చూపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (Twitter)

సంజూ శాంసన్ ఫొటో చూపిస్తున్న సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav Viral Video: సంజూ శాంసన్.. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ క్రికెటర్‌కు జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించని టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత జట్టులో స్థానం దక్కకపోవడంపై అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. ఇదిలా ఉంటే సంజూ శాంసన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం నాడు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జరగనుంది. ఇందుకోసం తిరునవనంతపురం విమనాశ్రయానికి చేరుకోవడంతో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

క్రికెటర్ల ప్రయాణిస్తున్న బస్సును చుట్టుముట్టిన అభిమానులు జట్టులో లేని సంజూ శాంసన్ కోసం నినాదాలు చేయడం గమనార్హం. అయితే వీరి అభిమానం సూర్యకుమార్ యాదవ్‌ను ఆకట్టుకుంది. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు గాను రెంటనే తన మొబైల్ ఫోన్‌ను తీసి అందులో సంజూ ఫొటోను అభిమానులకు చూపాడు. దీంతో ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెరిగింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ యువ క్రికెటర్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ వీడియో, ఫొటోలకు సంజూన్ ట్యాగ్ చేస్తూ యజువేంద్ర చాహల్, అశ్విన్, రోహిత్ శర్మ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేశారు. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ సఫారీలతో టీ20 సిరీస్‌కు కూడా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. అయిన అనంతరం అతడిని న్యూజిలాండ్-ఏ జట్టుతో భారత-ఏ జట్టుకు జరగనున్న మూడు సిరీస్‌ల వన్డే మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

సౌతాఫ్రికా-భారత్ చివరిసారిగా జూన్‌లో తలపడ్డాయి. ఆ ఐదు టీ20ల సిరీస్‌‌.. 2-2తో సమమైంది. నిర్ణయాత్మక ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రెండు జట్లు సిరీస్‌‍ను సమంగా పంచుకున్నాయి. సెప్టెంబరు 28న సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 ఆడనుండగా.. రెండో టీ20 గువహాటీ వేదికగా, మూడో టీ20 ఇండోర్ వేదికగా ఆడనుంది. దీని తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అక్టోబరు 11న చివరి వన్డే జరగనుంది. అనంతరం పొట్టి ప్రపంచకప్ సమరంలో టీమిండియా తలపడనుంది.

తదుపరి వ్యాసం